37.2 C
Hyderabad
March 28, 2024 21: 07 PM
కవి ప్రపంచం

ఆ న‌లుగురు ..

#TirunagariSrinivasNew

ప్ర‌తి క్ష‌ణం నీ చుట్టూనే ఉంటారు

నీ నీడ‌లా ప‌రిభ్ర‌మిస్తారు

ప‌లుమార్ల ప్ర‌య‌త్నాలలోనూ

వాళ్ల‌ను నీవు క‌లుసుకోవ‌డం క‌ష్ట‌మే

స‌హ‌జాతంగా పుట్టి పెరిగే

ఆనంద ఉద్వేగ ఉద్రేకాల్ని నియంత్రించి

క‌ర్తవ్యం వైపు  నిన్ను స‌త‌తం కద‌లిస్తుంటారు

సౌహార్ద్రాల‌ను ప‌లికిస్తుంటారు

యాంత్రిక‌త అంటుకున్న జీవితానికి

అలికిడులు అద్ది చైత‌న్యం పూస్తుంటారు

ముఖ పుస్త‌కాల‌ను తెరిపిస్తుంటారు

అర్థ‌మ‌య్యే ప‌రిభాష‌లో

అదృశ్యంగా మాట్లాడుతుంటారు

హృద‌య‌స్ప‌ర్శ‌తో అన్నీ పంచుకుంటారు

నియంత్ర‌ణ‌ల ప‌రిమితుల్ని చెబుతారు

నాలుగు మాట‌లు మాట్లాడే తీరిక నీకు లేన‌ప్పుడు

న‌వ్వుతూ కాసేపు వ‌దిలేస్తారు

నువ్వలసిపోయినా బ‌డ‌లిక లేకుండా

మెల‌కువ‌తో స‌న్న‌ధ్దంగా నిల‌బ‌డ‌తారు

నిత్య యుద్ధంతో  మూసుకుపోయే

నీ త‌లుపుల‌ను భ‌రోసా ఇస్తూ త‌డుతుంటారు

ఏదేమైనా నీ హితులు వారే

స‌న్నిహితులూ వారే

క‌నిపించ‌క వినినించే క్షేమేంద్రులు వారే

మ‌న‌సు ఇంటిలో ఆ నలుగురు

శాశ్వ‌త కుటుంబ మిత్రులు

పొమ్మ‌న‌కుండా పొగ‌పెట్టే

తెగ‌తెంపుల ప్ర‌పంచంలో

క‌ర్క‌శాలు  విదిలే క‌న్నీటి బాధ‌ల్ని

పంచుకోవ‌డానికి చివ‌ర‌కు మిగిలేది ఆ న‌లుగురే

నీలో క‌నిపించ‌క నివ‌సించే మౌన‌మునులే

నీతో చెలిమికి నీ బ‌లిమికి చేదోడు వారే

నీ మంచి చెడ్డ‌ల్ని అడిగేదీ వారే

నిన్ను అనుక్షణం స‌మీక్షించేదీ వారే

నీ చివ‌రి ఊపిరితోనూ న‌డిచొచ్చేది వారే

లోకానికి నీ సాక్ష్యం ఆ నలుగురే…..

నువ్వెళ్ళాక నీ ముద్ర‌ను మిగిల్చేదీ వారే

నీ ఆత్మ‌గౌర‌వ ప‌రిమ‌ళాలు వారే…..

-తిరున‌గరి శ్రీ‌నివాస్  8466053933

Related posts

విత్తు కాంక్ష

Satyam NEWS

సార్థ‌క ఉగాది…

Satyam NEWS

విలక్షణ చక్రవర్తి

Satyam NEWS

Leave a Comment