36.2 C
Hyderabad
April 25, 2024 22: 05 PM
కవి ప్రపంచం

మా తెలంగాణ

#Dr.AluriWilson

సంస్కృతి సంప్రదాయాలే మా తెలంగాణ

పొలిమేర్ల బోడ్రై పెట్టిన కాడినుంచి

పోచమ్మకు బలిచ్చే దాక

బొట్టుబెట్టిన కాడినుంచి

బోనమేత్తే దాక

గజ్జగట్టి గంతులేసే

బోనాల పండుగనుండి

బతుకు సింగిడికి పూల రంగులద్దే

బతుకు పాటల బతుకమ్మ ఆట దాక

పెద్దమ్మ కోలుపుల నుండి

పిరిల్ల పండుగ దాక

జన సంద్రమాయే సమ్మక్క సారక్క జాతర నుండి

గోండు గుండెల్లో కొలువుండే నాగోబా జాతర దాక

సంస్కృతి సంప్రదాయాలే మా తెలంగాణ

దశ దిశల క్యాతి గడించిన దాశరథి నుండి

చివరి క్షణం వరకు జనం కోసం కలం తో ఘర్జించిన

కాళోజి దాక

పాటలతో పోరాటాన్ని పుట్టించిన సుద్దాల

హనుమంతు నుండి

పదాలతో విప్లవాన్ని విరజిమ్మిన అలిశెట్టి ప్రభాకర్ దాక

పచ్చదనాన్ని పల్లవించే పల్లె పాటల వెంకన్న నుండి

పోరుబాటను పెనవేసే పోరు పాటల గద్దరన్న దాక

కవులే మా తెలంగాణ

తెలంగాణ తురుపుముక్క రావినారాయణ రెడ్డి

నుండి

తెలంగాణ పులిబిడ్డ బద్దం ఎల్లారెడ్డి

ప్రోఫెసర్ జయ శంకర్ నుండి

పోరుబిడ్డ కెసిఆర్ దాక

మా తెలంగాణ

– డా.ఆలూరి విల్సన్, నల్లగొండ, చరవాణి:9396610766

Related posts

చేత పెన్నుంటే……

Satyam NEWS

అక్షరాశృతర్పణం

Satyam NEWS

ఆహ్వానం

Satyam NEWS

Leave a Comment