27.7 C
Hyderabad
April 26, 2024 03: 37 AM
Slider కవి ప్రపంచం

అనాథబాల

#PVS Krishnakumari

ఏ తల్లి కన్నదో తెలియదు

కామాతురై కని వదిలేసిందో

పేదరికంతో వదిలేసిందో

తెలియదు కానీ

బ్రతుకు వీధి పాలైంది

అనాథాశ్రమమే నివాసమైంది

లాలింపులు, బుజ్జగింపులు లేవు

గోరుముద్దలు లేవు

అభద్రతా వలయం

ఏ ప్రేమ మూర్తులు

ఆపన్నహస్తం అందిస్తారో

అని ఎదురు చూపులు

అమ్మా,

మేము ఏ పాపం చేసాము

ఇలా గాలికి వదిలేశావు

మమ్మల్ని కనమని నిన్నడగలేదే

అని మౌనంగా రోదించే

చిన్నారుల హృదయ ఘోష

ఆ తల్లికి వినిపిస్తుందో లేదో!

(అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా)

పి వి ఎస్ కృష్ణకుమారి

Related posts

విచ్చల విడిగా ఉన్న బెల్ట్ షాపులను అరికట్టాలి

Satyam NEWS

వాట్ ఈజ్ దిస్: వలస కూలీలపై పోలీసుల ప్రతాపం

Satyam NEWS

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో షాక్

Satyam NEWS

Leave a Comment