33.2 C
Hyderabad
April 26, 2024 00: 47 AM
Slider కవి ప్రపంచం

క్షీర సాగర మధన సారం

#rajashrimortala

యుగ యుగాల సామాజిక పరివర్తనం
తరతరాల అనువంశిక సారం ఆద్యతం
పునీతమాయె పవిత్ర గంగా ప్రవాహ పరవళ్ళ చేరి

కొండ కోనల్లో తుళ్ళుతూ
దేశ దేశాలు పరికిస్తూ
మలుపు మలుపున కొత్త పుంతలు తొక్కుతూ

పాడి పొలాల దాహార్తి నింపుతూ
ముంచిన దోసిట ఐశ్వర్యం పెంచుతూ
తర తమములు ఎంచక

ఆయురారోగ్య ఐశ్వర్యములు పంచుతూ
ధర్మ అర్ద కామ మోక్షాలు ప్రసాదిస్తూ
దిన దిన ప్రవర్ధమానమై జీవించమని దీవిస్తూ

లోక కల్యాణార్దమై – నిత్యమూ చరిస్తూ…
ధర్మాన్ని నాలుగు పాదాల నడిపించే
శక్తి సమ్మోహనం…..నా సంస్కృతి

ప్రతీకను కుంకుమ – భరిణన నిక్షిప్త పరచి
గడప గడపకు అందించి
పవిత్రతను లలాటాన దిద్దిన

‘ సింధూరం ‘….నా సంస్కృతి….నా దేశం
నా దేశ సంస్కృతి….హిందూ దేశ సంస్కృతి

రాజశ్రీ రెడ్డి మోర్తల

Related posts

ప్లాస్మా దానానికి అందరూ సిద్ధం కావాలి

Satyam NEWS

బలవంతపు హిందీపై మోడీ వివరణ

Satyam NEWS

దళిత గిరిజన జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

Satyam NEWS

Leave a Comment