31.2 C
Hyderabad
April 19, 2024 05: 51 AM
కవి ప్రపంచం

“ఒంటరితనం”…!

#Dr. Chintapally Udaya Janaki Laxmi

నిశిరాత్రిలో

కమ్మేసిన చీకటిలా

ఎడబాటులో

విడచిన బంధంలా

మౌనాన్ని

వరించిన ఏకాంతంలా

జ్ఞాపకాల వలలో

చిక్కిన చేప పిల్లలా

సుడులు తిరిగే

అనుభవాల సుడిగుండంలా

సంఘర్షణతో

బద్దలైన బతుకు చిత్రంలా

విషాదాన్ని

అలంకరించుకున్న కాలంలా

గుండె నిండా

పేర్చుకున్న నిర్వికారంగా

ఆలోచన

కుప్పలు పేర్చేఅవశేషంలా

వీటన్నిటితో

మనసుకు ముళ్ళు గుచ్చుకుంటే

గిలగిలలాడిన మదిలో

ఏర్పడే ఒంటరితనం

ఒంటరితనం బాధో, వరమోమరి

ఒంటరితనాన్ని

బాధగా స్వీకరిస్తే

భవబంధాలకు చిక్కి

బక్క చిక్కుతావేమో….?

ఒక్కసారి ఆలోచించు

ఒంటరితనాన్ని

వరముగా స్వీకరిస్తే అద్భుతమే

ఓ “ఒంటరి”

బంధాలకు చిక్కవు

భవబంధాలు తెంచుకుని

భగవంతుని

చేరే మార్గం ఒంటరితనమో

లోతుగా ఆలోచిస్తే

ఈ లోకానికి

ఒంటరిగానే వచ్చావు కదా

ఒంటరిగానే

లోకాన్ని విడుస్తావు కదా

ఈ లోపు

నీవు ఎన్ని మూటలు కట్టినా

ఏ ఒక్క మూటను తీసుకెళ్లలేవు

ఈ జీవన గమనంలో

నేను నాది అనే భావన విడిచి

మనది అనే భావనతో బ్రతుకు

నిన్ను నీవు మలుచుకో

నలుగురితో మసలుకో…!

డా. చింతపల్లి ఉదయ జానకి లక్ష్మి, వింగ్స్ ఇండియా పౌండేషన్ డైరెక్టర్, ఒంగోలు, Ph: 9440731068

Related posts

‘కొత్త’ను స్వాగతిద్దామిక

Satyam NEWS

వంటింటి ఘుమ ఘుమలు

Satyam NEWS

బోణాల జాతర

Satyam NEWS

Leave a Comment