34.2 C
Hyderabad
April 19, 2024 20: 05 PM
Slider కవి ప్రపంచం

పిలిచా

#Manjula Surya New

ఆర్తితో పిలిచినా రావేల

భక్తితో కొలిచినా ఉలకవేలా

ప్రాతః సంధ్యావేళలో

ప్రజ్వలించే దీపాల తోరణాలు

నీ కరుణా కటాక్ష వీక్షణానికై

స్వాగతాలే పలుకుతూ ఎదురుచూసే

అగరు పొగరు సువాసనాలతో

గృహమంతా వ్యాపించే

నీ నామ పారాయణలతో ఆరామమే

ప్రతిధ్వనించే

సంకీర్తనలతో నా  మేను మైమరిచే

దానము స్నానాలతో

ఆత్మ పునీతమాయే

ఉపవాస దీక్షలతో తనువు

ఉత్తేజితమాయే

తులసీ కల్యాణంతో జన్మధన్యమాయే

ప్రార్థనలతో తదాత్మ్యం చెందినా కాని

మాసమంతా నీపైనే మనసు నిలిపిన కానీ

రావేల నీవు గంగాధరా

జోడుగా కదలిరా దామోదరా

నామమేదైతేనేమి దైవమొక్కటే

కొలిచే తీరు ఏదైతేమి భావమొక్కటే

ఫలితమాశించి చేయుటలేదు

ఫలములిస్తావని పూజించుటలేదు

అనుగ్రహమే చాలు ధన్యమవుటకు

అభయమిస్తే చాలు ముందడుగు వేయుటకు

మంజుల సూర్య, హైదరాబాద్

Related posts

జర్నలిస్టు నాగేంద్రకు ఏపిడబ్ల్యూజే మద్దతు

Satyam NEWS

స్పెషల్: మేడారం జాతరకు ప్రత్యేక టూర్ బస్

Satyam NEWS

మేమిట్లాగే ఉంటాము గాంధీ ‘జీ’

Satyam NEWS

Leave a Comment