27.7 C
Hyderabad
April 25, 2024 09: 51 AM
Slider కవి ప్రపంచం

మంచి మాట

#Karukula Anitareddy

డ్రమ్ముల మోతను సంగీతమంటున్నారు.!

పీలికబట్టల్ని వస్త్ర ధారణ అంటున్నారు.!

భౌతిక అకర్షణను ప్రేమని పిలుస్తున్నారు.!

సహజీవనాన్ని సంసారమంటున్నారు.!

గ్రాఫిక్ గిమ్మిక్కులను సినిమా అంటున్నారు.!

డూప్ ల పోరాటాన్నిహీరోయిజం అంటున్నారు.!

పదవుల పోరాటాన్ని ప్రజాస్వామ్యమంటున్నారు

అధికార ఆరాటాన్ని రాజకీయమంటున్నారు.!

ఆస్తుల పంపకాన్ని కుటుంబం అంటున్నారు.!

సరదాలను సంస్కృతి అంటున్నారు.!

భుక్తి  మార్గాన్ని  చదువు అంటున్నారు.!

కోరిన  కోర్కెలు  తీరిస్తేనే… దేవుడంటున్నారు.!

ఆస్తి ఉంటేనే… గొప్పవాడు అంటున్నారు.!

మందు పోయిస్తేనే…మిత్రుడు అంటున్నారు.!

సొమ్ములు తెస్తేనే…సంసారం అంటున్నారు.!

కాసులు తెస్తేనే…కాపురం అంటున్నారు.!

అవినీతి చేయకపోతే… అసమర్ధుడంటున్నారు.!

అక్రమాలు చేయకపోతే… అమాయకుడంటున్నారు.!

అసత్యాలు మాట్లాడితే… బ్రతక నేర్చినవాడంటున్నారు.!

నిజం పలికితే…బ్రతక నేర్వని వాడంటున్నారు.!

న్యాయబద్ధంగా ఉంటే… ఎలా బ్రతుకుతాడో అంటున్నారు.!

అన్యాయంగా బ్రతికితే…ఎంచక్కా ఉన్నాడంటున్నారు.!

అన్యాయాన్నిఎదిరిస్తే. .. అతని కెందుకు అంటున్నారు.!

నిజాయితీగా బ్రతికితే… కూడుపెడుతుందా అంటున్నారు.!

మాయకమ్మిన జీవితాన్ని శాశ్వతమనుకుంటున్నారు.!

మరణమనే మహా సత్యాన్ని విస్మరిస్తున్నారు.!

పరిస్థితులకనుగుణంగా..పాత అర్ధం చెరిగిపోయి  ప్రయోజనాలకు అండగా..పరమార్ధం ఆవిర్భవిస్తోంది!

డా.కరుకుల అనితారెడ్డి

Related posts

జన హృదయాల్లో నిలిచిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్

Satyam NEWS

ఐసోలేషన్ రూల్ మఠాష్: మా సారు దేవుడు కరోనా అంటుకోదు

Satyam NEWS

మళ్లీ విజృంభిస్తున్న కాల్ మనీ రాకెట్

Satyam NEWS

Leave a Comment