39.2 C
Hyderabad
April 25, 2024 17: 46 PM
Slider కవి ప్రపంచం

పల్లవించెను గుణింతము శుభాకాంక్షలై

#Manjula Surya New 23

పసిపాపలా స్వచ్ఛంగా నవ్వుతూ

పారే సెలయేరులా చైతన్య స్రవంతిలా

పిడికెడంత మనసుని

పీకిపాకాన పెట్టక

పుడమి ఒడిలో పూచే పువ్వులా

ప్రతిస్పందించే గుండెచప్పుడులా

పెంచుకున్న బంధాలను త్రుంచుకోకుండా

పేరే నీ పెట్టుబడి అన్నంత పేరును

సంపాదించుకొని

పైవాడి ఆశీస్సులతో

పొర పొచ్చాలు లేని

పోరాటము ఆరాటము

పౌరుషం అహం లేని

ప్రశాంత జీవనం గడపాలని

పండుగలా ప్రతి ఉదయం

అనిపించాలనీ మనసారా కోరుకుంటూ

నా ఈ పిలుపు పిల్లతెమ్మెరలా

అందరి హృదిని చేరాలని ఆకాంక్షిస్తూ

జీవితం పిజ్జా బేస్ లా మాత్రమే కాకుండా

టాపింగ్ లాంటి అభిరుచి ఆశయాలతో

మరింత తృప్తిగా ఆకర్షణీయంగా

సుసంపన్నం చేసుకునే దిశగా

సాగాలని అభిలషిస్తూ

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

మంజుల సూర్య, హైదరాబాద్

Related posts

ఘనంగా బలగం టీమ్ కి ఉగాది నంది పురస్కారాలు

Satyam NEWS

29 న మంత్రుల పర్యటనను జయప్రదం చేయండి

Satyam NEWS

30న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు కు “గురజాడ” పురస్కారం

Bhavani

Leave a Comment