39.2 C
Hyderabad
April 25, 2024 18: 46 PM
Slider కవి ప్రపంచం

సంక్రాంతి పండుగ

#SandhyaSutraveSankranthi

సంక్రాంతి అంటే నూతన క్రాంతి

సంక్రమణం,మారటం,చేరటం

పర్యాయ పదాలుగా  సంక్రాంతి

మార్గశిరం పూర్తితో

ఉత్తరాయణం మొదలు

మకరరాశిలో సూర్యుడి

ప్రవేశం మకరసంక్రాంతి

ఇది మూడురోజుల పండుగ

పంట చేతికొచ్చి

ఇది రైతుల పండుగ

కోడిపందాలు, ఎడ్లబళ్ళ పందాల

జోరుతో ఇది పోటీపండుగ

పొగమంచు హేమంతంలో

వెచ్చని భోగిమంటల కాంతిలో

అందమైన రంగవల్లులు

గొబ్బెమ్మలతో కూడి

పచ్చని తోరణాలతో ముంగిళ్ళు

బసవన్నల చిందులు

హరిదాసు కీర్తనలతో

ఆధ్యాత్మికత, దానధర్మాల

కలబోత మనసంస్క్రతి

భాగం అని భావితరానికి

కరదీపిక ఈ సంక్రాంతి

పక్షుల్లా, విమానాలతో

పోటిపడే గాలిపటాలతో

సిరిసంపదల పాలపొంగులు

ప్రతిఇంట పొంగాలని

ఊరించే కమ్మని ఘుమఘుమల

పిండివంటలు,తియ్యని

బెల్లం నువ్వుండల కలయికలో

మధురమైనదీ పండుగ

ఇది అందరి జీవితాల్లో

సరదాలు ,కొత్తకాంతులు

నింపాలని ,పల్లెలు

అందాల సోయగాలు

అలుముకోవాలనీ ఆకాంక్షిద్దాం

సంధ్య సుత్రావె, ఫోన్ 9177615967, సుల్తాన్షాహి, హైదరాబాద్

Related posts

కాంగ్రెస్ నేతలు తెలివిలేనోళ్ళైతే బిఆరెస్ నేతలిది అతి తెలివి

Bhavani

బంగారు, వెండి పతకాలు సాధించిన పోలీసు జాగిలాలు

Murali Krishna

కర్నూలులో ప్రియురాలుని చంపి ప్రియుడు ఆత్మహత్య

Satyam NEWS

Leave a Comment