39.2 C
Hyderabad
March 29, 2024 14: 17 PM
Slider కవి ప్రపంచం

ఆహ్వానం

#PuliJumunaSankranti

కాలం ఒక మహేంద్రజాలం

నిరంతర కాల చక్రభ్రమణానికి

అడ్డుకట్ట వేయడం అనివార్యం

కాలం క్షణక్షణం చేజారి పోతూ

మదిని దోచే మధురస్మృతులను

మనోవేదన కలిగించే జ్ఞాపకాలను

తన ఆనవాళ్లుగా సంతకం చేసి

చరిత్ర పుటల్లోకి చేరిపోతుంది

ఎన్నోఆశలు ఎన్నెన్నో ఆశయాలతో

ఆహ్వానించిన గడిచిన వత్సరం

కరోనా ఆగమనంతో కలవర పరచి

అనూహ్య పరిణామాలకు ఆలవాలమై

చరిత్రలో చేదు ముద్ర వేసింది

మానవ తప్పిదాలను అవగతం చేసి

అనుభవసారంతో గుణపాఠాలను నేర్పింది

గతానుభవాల దొంతరలో

రాలిన ఆశయాలకు జీవం పోసి

వేదనకొమ్మల్లో ఆశలసుమాలు విరియాలంటే

భవిష్యత్తుకు బాటలు సుగమం చేసి

ఆకాంక్షల విహంగానికి చేతన రెక్కలు తొడగాలి

తరిగిపోతున్న మానవవిలువలను

సంకుచిత స్వార్థ భావాలను

మది తలపులలో నిక్షిప్తమైన

మనో మాలిన్యాలను తరిమి

వెలుగు గవాక్షాలను తెరిస్తేనే

స్వచ్చతా కిరణాలు హృదినావరిస్తాయి

మమతానురాగాల ఆలింగనంతో

జీవితం సంతోషసౌరభాలతో గుభాళిస్తుంది

సరికొత్త ఆశలను చిగురింప చేస్తూ

నవ్య భావాలకు నాంది పలికితేనే

ధరణి పచ్చని కాంతులతో విలసిల్లుతుంది

-పులి జమున, మహబూబ్ నగర్, 8500169682

Related posts

బిఆర్ఎస్ మేనిఫెస్టోని కాపీ కొట్టారు

Satyam NEWS

కోటప్పకొండలో కార్తీక మాసం సందడి

Satyam NEWS

పల్లె నిద్ర చేసిన విజయనగరం టీడీపీ నేత నాగార్జున…!

Satyam NEWS

Leave a Comment