39.2 C
Hyderabad
March 28, 2024 17: 03 PM
Slider కవి ప్రపంచం

ఆమె ఆమెయే

#K.Harinath

అద్భుత కళా ఖండం

ఆమె ముఖ సౌందర్యం…!

నఖశిఖపర్యంతం అందాన్ని ఆవరించుకున్న కుందనపు బొమ్మ..!

బాపూ కుంచె నుండి జాలువారిన రాశిలా…

రవివర్మ మస్తిష్కం నుంచి

వెల్లివిరిసిన మల్లిలా…

దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యను తలపించే

అపరంజి బొమ్మె అనిపిస్తుంది.!

పండువెన్నెల్లో నిండు పున్నమి

చంద్రునిలా…

మిలమిల మెరిసే పసిడి ఛాయ మేను ఆమె ప్రత్యేకత..!!

ఆమె కురుల హొయలు సన్నజాజి తీగల పరిమళాలు..

ఆమె పెదవులే మధుకలశం

కన్నులే కలువలు..

పలు వరుసలే పనస తొనలు..

అయినా…!

ఆమెలో కనిపించేది కోమలమైన కలిమి

నిర్మలమైన మనస్సు

బాహ్య సౌందర్యం కంటే

అంతర సౌందర్యమే నన్ను ఆకట్టుకుంది..!

ఆమె ఎవరో కాదు..?

నేను ప్రియురాలు అని ఊహించుకున్నా…

ఆమె ఆమెయె…

ఇప్పటికీ నేను ఆమె అంతర సౌందర్యాన్నే ఆరాధిస్తున్నాను..!!

-కె హరనాథ్, 9703542598

Related posts

నవంబర్ 18 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

Satyam NEWS

త్రికూటాద్రి లో మార్మోగుతున్న”ఓం నమః శివాయ”మంత్రం

Satyam NEWS

జగన్ లెటర్ పై చీలిపోయిన సుప్రీం బార్ అసోసియేషన్

Satyam NEWS

Leave a Comment