24.7 C
Hyderabad
March 29, 2024 07: 21 AM
Slider కవి ప్రపంచం

గుర్తుచేసుకుందాం….

#ManjulaSuryaRepublicDay

ఎన్నో వత్సరాల పరాధీనత

ఎందరో త్యాగధనుల కలబోత

మరెందరో సమరయోధుల పోరాట తత్పరత

నేడు మనం అనుభవిస్తున్న ఈ స్వతంత్రత

రక్తధారలు స్రవించినా ఆగలేదు  పయనం

కారాగారంలో కరిగినా చెదరలేదు సంకల్పం

కాల్పులకు కార్పణ్యాలకు ఎదురెళ్లిన ధీరోదాత్తం

నేటి తరానికి భావితరానికి అది కదా ఆదర్శం

గుర్తుచేసుకుందాం జెండాను నిండుగా చూసుకుని

గుండెలనిండా సదా దేశభక్తిని నింపుకుని

గుడినే  చేసేద్దాం ఆ త్యాగధనులను మనసులో నిలుపుకుని

గుర్తెరిగి మసలుకుందాం

ఉద్యమలక్ష్యాలే ఊపిరిగా చేసుకుని

ఎగురేద్దాం జెండాను ఎక్కుపెట్టిన విల్లులా

ఎల్లలులేని ఖ్యాతికి ప్రతీకలా

ఆలపిద్దాం వందేమాతర గీతాన్ని సస్యశ్యామల భారతాన్ని అభివర్ణించేట్లుగా

నినదిద్దాం జయ జయ నాదాలను

విశ్వమంతా ప్రతిధ్వనించేట్లుగా…

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో

మంజుల సూర్య, హైదరాబాద్

Related posts

హైదరాబాద్లో రెండు భారీ భవనాల కూల్చివేత

Bhavani

ఆక్సిజన్ ఉత్పత్తిపై గురుగ్రామ్ కొత్త ప్రయోగం

Satyam NEWS

ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: పన్నాల దేవేందర్ రెడ్డి

Bhavani

Leave a Comment