34.2 C
Hyderabad
April 19, 2024 21: 40 PM
Slider కవి ప్రపంచం

గణతంత్ర పతాకోత్సవం

#SandhyaSutraveRD

భారత జాతీయపండుగ విశేషం

తొలి పౌరుడు రాష్ర్టపతిచే పతాకావిష్కరణం

పరేడ్లు,సాంస్కృతిక కృత్యాల సమాహారం

త్రివిధ దళాల కవాతు ప్రదర్శనం

విశేషభారతరత్న,పద్మాఅవార్డుల వితరణం

ప్రభుత్వపాఠశాలల అలంకరణం

దీనిలో విద్యార్థులు,ఉపాధ్యాయులే కీలకం

పతాకంలో మువ్వన్నెలు ,త్యాగమే కాషాయం,

శాంతిగా శ్వేతం,సమృధ్ధిగా హరితం,

ధర్మానికి సూచితం అశోకచక్రం

జాతీయజెండా, జాతీయచిహ్నాలు, జాతీయగీతం,

స్వాతంత్య్రసమరయోధులను గౌరవించడం

పౌరుల తొలి విధిగా బోధనే రాజ్యాంగం

మువ్వన్నెల పతాక రెపరెపలు

చిన్నారుల మదిలో స్వతంత్రభావనకు తొడుగు రెక్కలు

అవి బలపడితే భారతదేశరక్షణ,

ఉన్నతే ధ్యేయంగా గైకొంటారు వారు శిక్షణ

అనుకోరు రిపబ్లిక్ డే ఒక సాధారణ సెలవని,

గుర్తిస్తారు అది తమ బాధ్యతలకు నెలవని,

హుందాగా,బాలలే రేపటి పౌరులుగా.

జైహింద్

సంధ్య సుత్రావె, ఫోన్-9177615967 సుల్తాన్షాహి, హైద్రాబాద్

Related posts

ఇంటింటికి భగీరథ నీళ్లపై అశ్రద్ధ వద్దు

Satyam NEWS

వచ్చే నెల 9న జైల్ భరో కార్యక్రమం విజయవంతం చేయాలి

Satyam NEWS

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దు

Murali Krishna

Leave a Comment