28.2 C
Hyderabad
April 20, 2024 14: 08 PM
Slider కవి ప్రపంచం

చినుకు మొగ్గ తొడిగిన వేళ…!!!

#Yalamarthy Anuradha

గ్రీష్మం వేడిని చల్లార్చే ప్రియనేస్తం

చిరుగాలుల సవ్వడుల వర్తమానం ముందుగానే గిలిగింతలు గుసగుసలు ప్రారంభం

ఆకాశాన ఇంద్రధనుస్సు సందర్శనం

ఆహ్లాద వాతావరణం మనసుకు ఇంపుగా

సన్నటి జలతారు వాన

నింగికి నేలకు వారధి కడుతూ పూల జల్లులును తలపిస్తూ

వస్త్రపు నేతను మరిపిస్తూ

ఎద రసతరంగమై ఊయలలు ఆకు ఆకున తళుక్కున మెరిసే జల బిందువులు

ఉల్లాసాన్నీ ఉత్సాహాన్ని అందిస్తూ

తీగలకు హారంలా నిలిచి మురిపించే నీటి ముత్యాలు

మట్టి సుగంధ పరిమళాల

ఆస్వాదన మైమరుపు అన్నింటా మిన్న

రైతుల కళ్ళల్లో వెలిగే వెలుగులు

వర్షం ఎప్పుడూ హర్షమే!

యలమర్తి అనూరాధ హైదరాబాద్ చారవాణి:9247260206

Related posts

ఏప్రిల్ 1న ‘పరీక్షా పే చర్చ’

Sub Editor 2

అంధకారం లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు

Satyam NEWS

ప్రవాస భారతీయుడు సమీర్ పెనకలపాటి భక్తి పూర్వక సమర్పణ అయోధ్య శ్రీరామ్ ఆల్బమ్

Satyam NEWS

Leave a Comment