28.7 C
Hyderabad
April 24, 2024 05: 42 AM
Slider కవి ప్రపంచం

తొలకరి చినుకులు…!

#Dr.Chintapalli Udaya Janaki Laxmi

కాలచక్రం

ఎవరివైపు మొగ్గు చూపదని తెలిసినా

ఋతువు ముసుగు ధరించిన ప్రకృతిలో

తొలకరి కోసం

ఆశగా ఎదురుచూస్తున్న రైతన్న

చిటపట మంటూ

తొలకరి చినుకులు పలకరించగానే

పరవశించి రెప్పల పరదాల నుండి జారే

కన్నీటి చినుకుతో తడిసి ముద్దయ్యాడు

మట్టి పరిమళాన్ని వెదజల్లుతూ…

టపటప మంటూ

నీలిమేఘాలలో నుంచి రాలిన

చినుకుపువ్వులు  చిన్నపిల్లలను

తొలకరి చినుకులై పలకరిస్తే

పులకరించి కాగితపు పడవల

నావికులయ్యారు వాళ్లు

చినుకు చినుకు అల్లుకొని

నీటితివాచీలను చినుకు దారాలతో

కుట్టి … పచ్చపచ్చని తివాచీపై

పచ్చలు పొదిగిన పరుపులా

నీటి ముత్యాలు మెరిసాయి

తొలకరి చినుకు రాకతో

వానధారలు  పిల్ల కాలువలై

బాల్య దేహాలన్ని తామరాకులా

ఈత కొలనులలో తారాడుతున్నారు

తొలకరి జల్లుతో … తొలకరి చినుకుతో

తడిసి ముద్దవుతూ…!ముద్దవుతూ…!!

డా. చింతపల్లి ఉదయ జానకి లక్ష్మి, ఒంగోలు, Ph: 9440731068.

Related posts

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపిపై ఐటి దాడులు

Satyam NEWS

కాంగ్రెస్ ,బీఆర్ యస్ మజ్లీస్ పార్టీలు ఒక్కటే

Satyam NEWS

పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ అరెస్టు అప్రజాస్వామికం

Satyam NEWS

Leave a Comment