27.7 C
Hyderabad
April 20, 2024 02: 49 AM
Slider కవి ప్రపంచం

వర్చువల్ పెయింటింగ్

#Yenugu Narasimhareddy

లోకం విలవిలలాడిన జాలిలో

లోకబాంధవుడు మంటల అవతారం చాలిస్తాడు

విరహోత్కంఠితలా ఎదురుచూసిన

పుడమికాంత పిలుపందుకొని

చెట్లగుంపుల డెస్క్ టాప్ మీద

ఆకుల వర్చువల్ పాయింటింగ్ ని

రీటచ్ చేస్తుంది తొలకరి

అదే ఎమ్మెస్ ఆఫీసులో

కొత్త వర్షన్ వస్తూనే ఉన్నట్లు

ఏటేటా అదే చినుకు

మట్టి పులకింత మాత్రం నిత్యనూతనం

కాలాన్ని మనం మార్చుకున్నామని

కాలం గతిని మార్చుకోదు

చినుకై రాలి, వరదై పారి

ప్రవాహమై పరవళ్లు తొక్కడం దాని నైజం

డాటాను క్రాప్ అప్ చేసినకొద్దీ

పాటెర్న్ ను కొత్త ప్రయోజనాలకు ఆపాదించుకున్నట్లు

ఎక్కడి చినుకును అక్కడే

లాలించి పడుకోబెట్టాలి

వరదను మట్టి ఒడిలో నిలబెట్టాలి

కురిసిన జడులు సుడులై

ప్రవాహం అవతారమెత్తితే

వరదనీరై సముద్రానికి పయనమవకుండా చూడాలి

చినుకులకు ముందుచూపుల వినతులతో

నీటిని నెత్తికెత్తుకోవాలి

తొలకరినుండే జలజాగృత హారతులివ్వాలి

-ఏనుగు నరసింహారెడ్డి 8978869183

Related posts

కొల్లు రవీంద్రను కలిసిన నారా లోకేష్

Satyam NEWS

గర్భాశయ క్యాన్సర్ కు తొలి దేశీయ వ్యాక్సిన్ సిద్ధం

Satyam NEWS

పండగ వాతావరణంలో ప్రారంభమైన పాఠశాలలు

Satyam NEWS

Leave a Comment