36.2 C
Hyderabad
April 25, 2024 19: 23 PM
Slider కవి ప్రపంచం

కరోనాను కడతేర్చు మా తల్లి

#Immadi Rambabu Torrur

జగజ్జనని జగన్మాత జగద్రక్షణీ

లోకాలను ఏలే మూలపుటమ్మ ముగ్గురమ్మలు

మా మొర ఆలకించరా తల్లులారా.

గ్రామ గ్రామాన వెలసిన అమ్మా తల్లులు.. ముత్యాలమ్మ ,పోలేరమ్మ, ఎల్లమ్మ, రేణుకమ్మ

ఏ రూపంలో ఉన్నా ,ఎలా కొలిచినా

మేమెలా పిలిచినా ,నీవే కదా జగద్రక్ష నీ,

జగన్మాత మా కొంగు బంగారమే

నీవే తల్లి  మమ్ము ఏలుకో రావా

ఏటేటా నీకు ఉత్సవాలు ,

నీ పండుగలు ,మా ఇంట

సంతోష ఆనందాలు.

మొదట పూజ నీ కే తల్లి

అందుకో మా వందనాలు.

ఈ మహిలో అన్ని నీ మహిమలే.

జగాన జనాలు పడుతున్నా

కరోనా కష్టాలు కడతెర్చు ,రావా

కరుణించవా కనకదుర్గమ్మ తల్లి

మా జీవితాలను భద్రంగా చూడవా

ఓరుగల్లు భద్రకాళీ మాత

ఊరూర ఉన్న మా గ్రామ దేవతలు 

ముత్యాలమ్మ పోలేరమ్మ లు

మీ బిడ్డలం మము సళ్ళంగా చూడండి

కరోనా మహమ్మారి రాకతో ..

బోనాల పండుగ ఉత్సవాలు కరువాయే .

మము కన్నవారిని , మా కన్నవారిని

కంటికి రెప్పలా కాపాడవా ..

జగజ్జనని కరుణించవా ,మా తల్లి .

మల్లొచ్చేడు ఘనంగా మీ ఉత్సవాలు చేయ

మము కాపాడవా మా తల్లి.

ఇమ్మడి రాంబాబు,తొర్రూరు, జిల్లా మహబూబాబాద్, 9866660531

Related posts

ఊపిరి పీల్చుకుంటున్న వినాయక చందాదారులు

Satyam NEWS

భూములను లాక్కునే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలి

Satyam NEWS

ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీస్‌ హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు

Satyam NEWS

Leave a Comment