28.7 C
Hyderabad
April 25, 2024 04: 49 AM
Slider కవి ప్రపంచం

మహంకాళి బోనాల పండుగ

#Konam Parasuramulu

మండే సూర్యుడు మంటల

తాపం తీరిన వేళ

తొలకరి జల్లులు పుడమిని

పులకింప జేసే వేళ

ప్రకృతి మాతకు ఆకు పచ్చని

చీరను అలంకరించిన వేళ

పండుటాకులు రాలి లేత

ఆకులకు పురుడు పోసిన వేళ

పచ్చని ప్రకృతి ప్రవేశించే వేళ

ఆషాఢ మాసంలో అందాలు

విరజిమ్మే కాంతితో

రంగు రంగుల పూలు మొగ్గలు

తొడిగే సమయంలో

కొమ్మల మాటున దాగిన కోయిలమ్మ కమ్మని రాగాలు

ఆలపించే వేళ

పచ్చని చెట్ల కొమ్మల్లో రామచిలుకలు రాగాలు

తీసే వేళ

అమ్మవారికి నైవేద్యం

బెల్లం బువ్వ,పసుపు బువ్వ

పెరుగు బువ్వలతో నైవేద్యం

మామిడాకు తోరణాలు

స్వాగతం పలుకగా

వేప కొమ్మలతో శివసత్తులు

శిగమూగుచుండగా

పోతరాజులు విన్యాసాలు

చేయగా

డప్పుల మోతలతో పట్నం దద్దరిల్లిపోయేది

బోనాల దీపాలు చీకట్లను

తొలగించగ

అమ్మల గన్న అమ్మ

ముగ్గురమ్మల మూలపుటమ్మ

భాగ్యనగర పెద్ద ముత్తైదువ

ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ

వీధి వీధుల్లో ఆనందం నిండుగ

భక్తుల గుండెల నిండా

సంతోషాల సంబరాల పండుగ

కొలిచిన వారికి కొంగు బంగారమై

అమ్మ వారి ఆలయాలు

దేదివ్యమానమై వెలుగొందగా

భక్తజనులచే మహాకుంభ మేలను తలపించుచుండగా

భక్తుల కోర్కెలు తీర్చే

ఉజ్జయిని మహంకాళి తల్లి

లస్కరు అమ్మవారి బోనాలు

గోల్కొండ కోట బోనాలు

సందడి చేయగా

లాల్ దర్వాజా బోనాలు

లష్కరు బోనాలు

బాధలు తీర్చే బంగారు తల్లి

పొర్లు దండాలతో పాపాలు

తొలగించె పెద్దమ్మ తల్లి

కుంకుమార్చనలతో మహిళల

పసుపు కుంకుమలు కాపాడే

అమ్మోరు తల్లి

పసిపిల్లలను ఆశీర్వదించగా

ఆనందం నిండగా శివతాండవం చేయగా

గడప గడపకు అమ్మోరు

పసుపు కుంకుమలు పెట్టగా

అంగ రంగ వైభవంగా

పిన్నపెద్దలందరు సందడి

చేయగా

గ్రామదేవత గుడులన్నీ

సందడులు చేయగా

ఆడబిడ్డలకు అసలైన పండుగ

కాచువారులకు కమనీయ

పండుగ

తెలంగాణ ఆడపడుచులకు

అసలు సిసలైన పండుగ

కోణం పర్శరాములు, సిద్దిపేట, చరవాణి : 9959524585

Related posts

జైల్లో మగ్గుతున్న ఖైదీలకు బైయిల్ మంజూరు చేయండి

Satyam NEWS

రికార్డు స్థాయిలో మోపిదేవి స్వామి హుండీ ఆదాయం

Satyam NEWS

జూనియర్ ఎన్టీఆర్ కు చెల్లి చేతిలో పరాభవం

Satyam NEWS

Leave a Comment