39.2 C
Hyderabad
April 25, 2024 16: 39 PM
Slider కవి ప్రపంచం

సంబురం

#Baswa Rajkumar Siddipet

తెలంగాణ ప్రజల సంస్కృతిని ప్రతిబింబించే  పండుగ

తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఘనమైన బోనాల పండుగ

ఆషాడ మాసం మొదలు శ్రావణమాసం దాకా

అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ వేడుక

పాడిపంటలు పొంగిపొర్లాలని

అందరూ ఆరోగ్యంగా జీవించాలని

దేవతలను ప్రత్యేకంగా కొలిచే కన్నుల పండుగ

బోనం అంటే భోజనం అని కుండ అని

ఇదే దేవునికి సమర్పించే నైవేద్యం అని చాటి చెప్పే అపురూప వేడుక

కొత్త మట్టి కుండను అందంగా అలంకరించి

దానిలో వివిధ వంటకాలను నైవేద్యం గా పెట్టుకొని

దానిమీద మరొక చిన్నకుండను  పెట్టి

దానిని కూడా అలంకరించి సాక తో నింపి

ఈ చిన్న కుండపై మట్టి కంచుడు ఉంచి

నూనె పోసి గండ దీపం వెలిగించి వడివడిగా సాగే చక్కని పండుగ

సంప్రదాయ వస్త్రధారణలో స్త్రీలు బోనం నెత్తుకొని

ఊరేగింపుగా గుడివైపు నడిచివెళ్లే చూడముచ్చటైన వేడుక

శివసత్తుల భవిష్యవాణి

కొరడా పట్టుకొని పోతరాజు చేసే నృత్యం

డప్పుల చప్పుళ్లతో

కడు కమనీయంగా సాగును ఈ మహోత్సవం

గ్రామదేవతల అనుగ్రహం కోసం ఘనంగా జరిపే ఈ పండుగ

నిత్యం ప్రజలు పడే కష్టాలు,బాధలను మరిచిపోయాలా చేసి

ఉపశపనం ఇవ్వడమే గాక

వారిలో మరలా కొత్త ఉత్సాహం నింపే

కోటి కాంతుల పండుగ బోనాల పండుగ.

బస్వ రాజ్ కుమార్, సిద్ధిపేట, 9392006080

Related posts

మన పి.వి.

Satyam NEWS

దగ్ధమైన హెయిర్ సెలూన్ షాపు బాధితుడికి ఆర్థిక సహాయం

Satyam NEWS

అంగన్ వాడీ ఆయా నే అమ్మగా మారి…

Satyam NEWS

Leave a Comment