30.7 C
Hyderabad
April 19, 2024 10: 01 AM
Slider కవి ప్రపంచం

రావమ్మా ..

#Dr.Sammeta Vijaya

కరోనా కబళిస్తున్నవేళ ..

మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ,పెద్దమ్మ

డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ

పేరేదైనా మా అమ్మవునీవేకద

ధూపం దీపం నైవేద్యం పాలు, పెరుగు ,

వేపరెమ్మలు పసుపు కుంకుమ

బెల్లంతో  సిద్ధమైన బోనం

గజ్జకట్టిన తమ్ముడు పోతరాజు

కొరడాతో కాపలా కాస్తున్నాడు..

ఊరేగింపులు ఉత్సవాలు ఊరడి వైభోగం

కనులార చూసే ఆనందం నీరాకతోనే ..

భౌతికదూరం,  తగుజాగ్రత్తలు పాటించక

కుప్పలు తెప్పలుగా  పాజిటివ్ కేసులు..

పట్టణాల నుంచి గ్రామాలకు విస్తరిస్తూ

విజృంభిస్తూ  మరణాలు పెరుగుతున్న వేళ..

కరోనాని తరిమికొట్టి ధైర్యాన్ని నూరిపోసి

అన్యాయాలను అక్రమాలను అరికట్టేందుకు

వీధికొక పోతరాజును నిలబెట్టి

ఆదిపరాశక్తివి నీవై మముకాపాడుతూ

మా గుండెలలో కొలువైన  గ్రామదేవతవి

అమ్మోరివి నీవే ..నీవు రావలిసిందే అమ్మా

మా భయాలను తొలగించి

మా బోనం స్వీకరించి మము దీవించమ్మా

కడుపులోని కల్మషాన్ని కడిగి పారేసి

మనసులలో మలినాలని తుడిచేసి

ప్రక్షాళన కొనసాగించమ్మా

మాపై నీ కరుణామృతాన్ని కురిపించమ్మా

డా. సమ్మెట విజయ, హైదరాబాదు

Related posts

దళిత వి ఆర్ ఓ లను తప్పించి అగ్రవర్ణాలకు బాసటగా ఉన్నతాధికారి

Satyam NEWS

స్త్రీ హింస వ్యతిరేక పక్షోక్షవాలు ఆరంభం

Bhavani

ఘనంగా భత్యాల వర్గీయుల టీడీపీ ఆవిర్భావ కార్యక్రమాలు

Satyam NEWS

Leave a Comment