31.7 C
Hyderabad
April 19, 2024 00: 28 AM
Slider కవి ప్రపంచం

జాతర

#Koroprolu Radhakrishna Rao

సీII ఆషాఢ మాసాన నమ్మోరు నేతెంచ

జాతర జరిగేను జయముగాను

దొలిదొల్త గోల్కొండ మలిదశ లష్కరు

లాలుదర్వాజలో లయము గాగ

పట్టుచీరలుగట్టి వడ్డాణములు బెట్టి

బోనాల నెత్తుచూ బూజ లలర

భవిష్య వాణితో బంగారు దల్లియై

పూనక మూగేను ముచ్చటగను

తే.గీ.పోత రాజుల రంగమ్మునూతమొసగ

వాద్య సంగీత హేలతో హృద్య మవగ

వీధి వీధిన యంగళ్ళు వెలయు చుండ

భక్త కోటికి స్వర్గము భాగ్యనగరి

కొరుప్రోలు రాధాకృష్ణారావు

Related posts

దిశ కు న్యాయం చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు

Satyam NEWS

మిస్టరీ:బరాత్ నుండి వెళ్లి చెట్టుకు ఉరేసుకుని శవమై

Satyam NEWS

త్వరలో ఏపి  విశాఖ లో బిఆర్ యస్ సభ

Satyam NEWS

Leave a Comment