32.7 C
Hyderabad
March 29, 2024 11: 55 AM
Slider కవి ప్రపంచం

అవనికి చైతన్యం అమ్మ

#Sailaja Mitra

అవనిలో కనిపించి వెలుగులో దర్శనమిచ్చిన అమ్మ

బోనాల సందడికి సిద్ధమైంది

ఆకాశమంత కారణంతో ఎదురైనా ఆ మనోజ్ఞరూపం

చివరి శ్వాస దాకా  నాకు మహా పధం..భవిష్యత్ కు వర్తమానం

శుభంగా మన:కుహరంలో కనిపించే అద్వైత సౌకుమార్యం

భక్తుల హృదయ తీరంలో

తనువొక వారనీయ దేవతా ప్రాసారమైంది

దివ్వె నుండి దివ్వెతో దశ దిశ లా వ్యాపించినా

ఆ దివ్య రూపం దివ్య దశను చేరుకునే ప్రయత్నమై

జీవన సర్శ్వాస్వాన్ని బింబించే దర్పణమైంది.. దేవతైంది

ఏదో ధ్వని .. అంతలోనే నిశ్శబ్దం ! అంతలోనే అలజడి

అమ్మ పిలుస్తోందా ? పిలుపులా అనిపిస్తోందా ? అన్నంతగా

మోడువారిన జీవితాలకు ఆనంద ప్రవాహాన్ని అందిస్తూ

శాంతి చెదిరిన రాత్రులకు వెలుగు పావురాలను పరిచయం చేస్తూ

నిద్ర ఎరుగని గాలి సమాజం లో జీవన రహస్యమై నిలిచింది

కాలానికి ఒక గాత కట్టి, నేలను మండిస్తు

నింగిని మెరిపిస్తూ ప్రాణికోటికి ఆహ్లాదమై నిలిచింది

దిక్కుల చెక్కిళ్ళను నిమురుతూ కదిలే గాలి ఎదపై నిలిపి

కాల గమనాన్ని నిశ్చింతగా నిద్రించేలా చేస్తుంది

మేఘాల్ని బంధువులుగా పరిచయం చేసి కదులుతుంది

ఎక్కడ్నించి చూసినా అమ్మ దీవెనల ఏకాకృతి

మనసు చెదిరిన స్థితిలో కనిపించే భ్రాంతి కాదేమో

అమ్మ ఛాయ పరచుకున్న గతకాలపు కళ్ళు

ఆణువణువూ చైతన్యమై, సరికొత్త రూపమై కనిపిస్తోంది

భువిపై స్వర్గాన్ని ఊహిస్తూ ఉత్సాహంతో ఉందీ సమయం

ఈ లోకంలో ఎక్కడ చూసినా కనిపించే ఆ మూర్తి స్వరూపం ఎవరిదీ ?

పడగలెత్తిన ఉదయంలా నిత్యం శోభిస్తోంది

పలకరిస్తున్న మౌనంలా ఉంది

నిదురతో, మెలకువతో బతుకు దారి మలుపులతో

భద్రపరచుకున్న గతం లా ప్రయాణం సాగుతుందనే నమ్మకంలా ఉంది

ఈ కృతి భూమిక విశ్వమంతా మెరుస్తున్న చైతన్యం లా ఉంది

శైలజామిత్ర 9290900879

Related posts

బిల్లులు చెల్లించాలని ప్రభుత్వ కాంట్రాక్టర్ల డిమాండ్

Satyam NEWS

ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాఖీ కట్టిన అక్కలు

Satyam NEWS

తెలంగాణా అక్రమనీటి వినియోగంపై ప్రధానికి ఫిర్యాదు

Satyam NEWS

Leave a Comment