37.2 C
Hyderabad
March 29, 2024 21: 02 PM
Slider కవి ప్రపంచం

ఎవడాపగలడు ?

#K.Haranath

పుడమి గర్భం

ప్రసవించే మొక్కను

విరుల తరుల

సిరుల ఝరుల

తొలకరి మొలకలను

పూచే పూలను

వీచే గాలిని ఎవడాపగలడు ?

చీకట్లను ఛేదించి

తూర్పు కొండల్నుంచి

ఉదయించే భానుడి

దివ్యతేజో  ప్రభావాన్ని

ఎవడాపగలడు ?

ఆకాశం హృదయం నుండి

మేఘాల మేలిముసుగుల్ని

చీల్చుకుని సిగ్గు దొంతర్లతో

టప టప టప

ముత్యాల వోలె రాలెడి

చిటపట చినుకుల

నెవడాపగలడు ?

నేల తల్లి గుండెల్ని

తన నాగలితో

సుతిమెత్తగా రైతన్న

కటికనేల చీల్చినప్పుడు

రాలే సిరుల పంట

నెవడాపగలడు ?

వీచే ఈ గాలి

కొత్త పాటకు పల్లవై

తొలకరి పులకరింతలతో

నా భూమి పచ్చని

పైరులతో పునీతమై

నవ్యనవోన్వేషంతో

వికసించే సుందర దృశ్యాన్ని

ఎవడాపగలడు ?

కె.హరనాథ్  9703542598

Related posts

జూట్ పరిశ్రమ పనులు నిలిపివేయాలి

Satyam NEWS

ఖైరతాబాద్ గణనాధ విగ్రహ తయారీ పూజ ప్రారంభం

Satyam NEWS

Vijayanagaram Police: రెండున్నర గంటలు…45 ఫిర్యాదులు…

Satyam NEWS

Leave a Comment