40.2 C
Hyderabad
April 19, 2024 15: 28 PM
Slider కవి ప్రపంచం

పీవీకి నివాళి

#K.Haranath

ఓ నిస్వార్థ నిరాడంబర

రాజకీయ దురంధరా

బహుభాషా నేతగా

రాజకీయ చదరంగంలో

ఎత్తులకు పై ఎత్తులు వేసి

అహంకారాంధకారాన్ని

అణచివేసి ఆహుతిచేసి

కాలాంతక నాయకుల్ని

కాలరాచిన

జిత్తులమారి రాజకీయ

చతురాగ్ర శిఖరమా

విశ్వనాధ  వేయిపడగలపై

అనువాద అక్షర కిరణాలను

‘సహస్ర ఫణ్’గా సంధించిన

వాచస్పతివి నీవు—-

రాజకీయ కుట్రల విషనాగుల

నినాదాలు,వివాదాలకు

తిలోదకాలిప్పించి

ప్రగతి ప్రతీకగా

జగతి పతాకమై ప్రజ్వరిల్లగా—

ఉజ్వల దేశ భవిష్యత్తుకు

ఊపిరివై ప్రతి తెలుగు వాడి హృదిగది

మనసు నిండా నిలిచావు

పీవీ నీకివే శతజయంతి

మహోత్సవాలకి నా

కవితా సుమాల నివాళి

కె.హరనాథ్ 9703542598

Related posts

మాయ మాటలు చెబుతున్న నిజామాబాద్ ఎంపి

Satyam NEWS

బిఆర్ఎస్ మేనిఫెస్టోని కాపీ కొట్టారు

Satyam NEWS

దివ్య దీపోత్సవం!

Satyam NEWS

Leave a Comment