27.7 C
Hyderabad
April 26, 2024 03: 48 AM
Slider కవి ప్రపంచం

ప్రకృతి మాత

#Manjula Surya New

అమ్మ ఉండి కూడా నా దేశం

అనాథ ఎలా అయ్యెను

జగజ్జనని ఉన్నా

జగతికి రక్షణ లేకుండెను

పసికూనలాంటి ప్రాపంచకము

పట్టించుకునేవారు లేక

కొట్టుమిట్టాడుతుండే

పసిది ఏడవగానే పరుగున వచ్చే తల్లి

మమకారపు మలాముతో

స్వాన్తన చేకూర్చదేమి

ఇంత జరుగుతున్నా

కొంతైనా చింతలేక చెంతకు రాదేమి

ఒడిలోకి తీసుకోవాల్సిన తల్లి

ఒదిలేసేను ఎందుకిలా

ఆపదలో ఉన్నాము

ఆదుకునగా రావమ్మా

ఆక్రోదనలు ఆక్రోశాలు అవనియంతా ఆవరించే

ఆక్షేపించే సమయం కాదు

అక్కున చేర్చుకోవమ్మా

కుక్క చావు చస్తున్నాం

కిక్కురుమనవేల నీవు

ప్రకృతి మాతవు నీవు

ప్రకోపిస్తుంటే చూసేవేల

ప్రశ్నకు ప్రశ్నే సమాధానమా

పుడమి ఒడిలోకి వెళ్లడమే

నీవు మాకు చూపించే మార్గమా

ఇక ఓపలేకున్నాము

తాళలేకున్నాము

భక్తితో కొలిచేము నిన్ను

మా బ్రతుకును శాసించు

బోనం తెచ్చేము తల్లి

ప్రాణము కాపాడరామ్మా

శాకము పాకము నీకే

శోకాన్ని మిగుల్చబోకు

భరోసా ఇవ్వుతల్లీ

మా వెన్నంటి నీవున్నావని

కళ్ళు తెరిచి కరుణించు

నీ పిల్లలను కనికరించు

ఈ యుద్ధములో  గెలిపించు

అజేయులుగా మము నిలిపించు

మంజుల సూర్య, హైదరాబాద్

Related posts

దోచుకో నా రాజా: నకిలీ పత్తి విత్తనాల వెల్లువ

Satyam NEWS

నిరుపేదలకు వైద్య సహాయం అందిస్తున్నసీఎం కేసీఆర్

Satyam NEWS

ప్రధానిపై అసభ్య పోస్టులు పెట్టిన అటవీశాఖ అధికారి

Satyam NEWS

Leave a Comment