37.2 C
Hyderabad
March 28, 2024 17: 52 PM
Slider కవి ప్రపంచం

బోనం

#Ch.Usharani Chandanagar

వూరంతటికి దిక్సూచి ఈ గుడి

ఎన్నెల కెరటాలపైన తేలుతున్న చంద్రుడిలా ఊరిపొలిమేరల అమ్మగుడి..

ఎండుగాలం మౌనముద్ర ధరించిన రుద్రాక్ష ఈ పోశమ్మ

చలిగాలం ఎచ్చటి సలిమంట ఈగుడి

ఆశాఢమేల భూమంతా పచ్చటి యాపకొమ్మల మొగులైంది

సితుక్కుమంటున్న ఈఆనలో

పసుపు పూసిన పట్టగొలుసుపాదాలు కెరటాల ల్లే బయలెల్లినాయి

ముత్తైదువలంతా ఎల్లమ్మ మల్లమ్మ దేవతలైనారు

నెత్తిన దీపనక్షత్రాలు ఎలుగలు సిమ్ముతున్నయి

రంగం అయిన సంబురం అబురాన్నంటింది

యాడాది పొడుగునా కళ్ళు ఈ దినం కోసం ఎదురు చూస్తాయి కొత్తబట్టలు …బెల్లం అన్నం కోసమే కాదు ..                       

దూరపు చుట్టాలు దగ్గరయ్యి ఇల్లంతా సందడిగా మారిపోతది                              

గల్లీలన్నీ..పలకరింపుల ప్రవాహాల్లో ప్రేమ వాసనలేస్తయి 

డోళ్ళు… డప్పులు యాప కొమ్మలూ.. బోనం కుండలు..                        

పట్నం పట్నమంతా బోనమెత్తిన ముత్తయిదువైతది 

అమ్మవారి గుళ్ళన్నీ రాత్రిని ..పగటీల చేస్తూ దీపాల ఎలుగులైతయి                          

తొవ్వ పొడుగూత ఊదుడు బుగ్గలు ..పేలాల ముద్దలు సిన్నప్పటి బోనాల జాతర మల్లా నన్ను సిన్న పిల్లను చేస్తది                                  

బోనం జాతరల తిరిగిన నా చిన్న పాదముద్రలను లెక్కపెట్టి మల్లా నాకు సూపెడతది          

నేను పెద్దదాన్ని అనే సోయి తెలవకుంట నాపసితనాన్ని యాడాదికోసారి నా ముందట నిలపెడుతది బోనంపండుగ.        

బోనమంటే ఈ పట్నం ఆకాశంల నన్ను పతంగిని చేసిన రంగుదారం                       

బోనమంటే నన్ను చంకనేసుకొని వీధులు తింపే అమ్మతనం

సిహెచ్.ఉషారాణి హైదరాబాద్ 9441228142

Related posts

అయ్యయ్యో బ్రహ్మయ్య… సీఐకి ఎంత అన్యాయం చేశావయ్యా

Satyam NEWS

ఏసీబీ వలలో బుక్కరాయసముద్రం సిఐ

Satyam NEWS

షర్మిలకు పెద్ద షాక్ ఇచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్

Satyam NEWS

Leave a Comment