28.2 C
Hyderabad
May 24, 2025 09: 30 AM
Slider కవి ప్రపంచం

భాగ్యనగర భాగ్యశోభ

#Satya Neelima Wanaparthy

ఆషాడమాసాన ఆరుద్రకార్తెన

అమ్మవారి బోనాలపండుగ

తెలంగాణతల్లి కన్నుల వెలుగుగ

భక్తుల మనసంతా నిండగ

భాగ్యనగరమంతా భాగ్యశోభలు నింప

గోలుకొండకాడ గగనాన్ని సరిపోలే

జనసందోహ జాతరోలే

నింగిలోని సుక్కలన్నీ

నేలమీది కొచ్చినట్లు

శివసత్తుల పూనకాలు

పోతురాజు నాట్యాలతో

సందడి నెలకొనగా

బోనమెత్తిన ఆడపడుచులు

పుట్టింటి మెట్టింటి గౌరవము

కాపాడే అమ్మవారి అంశలై

నిష్టగా పూజించి నైవేద్యం సమర్పించి

కోరికలే కోరంగ దీవించి పంపెనంట

సకలజనులను గ్రామదేవతలు…

-సత్యనీలిమ, వనపర్తి,  9502156813

Related posts

ఎంపి మాధవ్ వ్యవహారం సిగ్గుచేటు: సాయినాథ్ శర్మ

Satyam NEWS

మొక్కజొన్న, వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

Satyam NEWS

నాటి ప్రకాశం గారి పార్క్…నేడు మహిళా పార్క్…కానీ…!

mamatha

Leave a Comment

error: Content is protected !!