Slider కవి ప్రపంచం

ఆషాఢమాసం బోనాలు

#Mudumbai Seshaphani

తెలంగాణకు మకుటాయమానం బోనం

ఆషాఢమాసాన ఆరంభమగు

గ్రామదేవతా ఆరాధనోత్సవం

ప్రకృతి ప్రకోపం శాపమై

ప్రాణాంతక మలేరియా బారినబడి

ఉసురుకోల్పోయిరి జంటనగరాల జనులనేకులు

అంటువ్యాధులు ప్రబలకుండా

భక్తితో జగన్మాతనారాధించు మహోత్సవం

చిత్రాన్నప్రియయైన అమ్మవారికి

భక్తిప్రపత్తులతో నివేదించు నైవేద్యం బోనం

కొత్త కుండలో శుచిగా అన్నం వండి

పసుపు కుంకుమలతో పూజించి

ఘటం చుట్టూ వేపాకులు గట్టి

బోనం పైభాగమున దీపమును తీర్చి

ఎత్తుకుందురు తెలంగాణా పడతులు

మోదముప్పొంగ తలపై బోనమును

నిర్వహింతురు అంగరంగ వైభవంగా

లాల్ దర్వాజా లష్కర్ బోనాలు

ఉజ్జయిని మహంకాళి బోనాలు

జగన్మాత సోదరుడు పోతురాజు

గ్రామరక్షకుడై బోనమెత్తు సమయాన

కొరడా ఝళిపించి సృష్టించు వీరంగం

వినిపించు మాతంగి రంగమును

కూష్మాoడ బలి జరుగు బోనాల తుదిదినం

మక్కువతో భక్తిభావముప్పొంగ

రాష్ట్రపండుగగా గుర్తింపునొసగె తెలంగాణా సర్కార్

-ముడుంబై శేషఫణి, వరంగల్ అర్బన్, 9441771955

Related posts

అమెరికాలో తెలుగువారు క్షేమంగానే ఉన్నారు

Satyam NEWS

‘సింహవాహిని దర్శనం-సకల పాప సంహారం’

Satyam NEWS

కేంద్రం ఇచ్చిన నిధులను తామిచ్చినట్లు చెబుతున్న ధర్మాన

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!