28.7 C
Hyderabad
April 20, 2024 05: 27 AM
Slider కవి ప్రపంచం

అమ్మతల్లి

#Dr.Namilikonda Sunitha

ముగ్గురమ్మల మూలపుటమ్మ

మంకాళమ్మా   వందనం

దుష్టశిక్షణ శిష్టరక్షణ జేయు

చండిచాముండీ వందనం

కరోనా మహమ్మారిని తరుము 

మా తల్లీ మంకాళమ్మా

అంగరంగ   వైభవోపేతంగా

బోనాలపండుగ జరగాలి

పాడిపంటల్లోన శోభిల్లుతల్లీ

ఆరగింపు ఆషాఢబోనం

ఆషాఢమేఘాల తొలకరి జల్లు

నీ వాకిట సానుపు వేయగా

అరుణారుణ పిడసలేసి నింగి

సుక్కలు రంగవల్లులు దీర్చ

తెలంగాణతల్లి గజ్జెగట్టి బోన   

మెత్తి నీ ముంగిట నిలవగా

వేదమంత్ర ఘోషతో ఘటమెత్తి

పూజారి ఘల్లున అడుగేయగ

డప్పుడోళ్ల చప్పుళ్ళు,పొట్టేళ్ల

ఉరుకులూపోరగాళ్లపరుగుతో

ఆడబిడ్డలంతా అమ్మతల్లి       

రూపమై  బోనమెత్తి కదలగా

పోతరాజు  వీరంగం, శివసత్తుల

పూనకం  శివా నీకు సంబరం

పసుప గుంకాలు, పూలుపండ్ల

నిమ్మ దండలు నీకలంకారాలు

జోడుబోనాలు, కల్లుసాకలు

తొట్టెలు నీకు  పిల్లలు మాకు

ధూపదీపారాధనతో సింహ

వాహినిగా వెలిగసిన రూపం

రంగంలోమాతంగై భవిష్యవాణి

బహిరంగ పరచే లోక జనని

భక్తుల మొరనాలించి శాంతించి

శివశక్తి చిరునవ్వు చిందించగ

అంబరాన్నంటిన సంబరంలో

సబ్బండవర్ణాల  ఆనంద హేల

జానపదవిన్యాసాలు తెలగాణ

సంస్కృతికి ప్రతిబింబాలు

అమ్మతల్లి బోనాలు మనజాతి

వారసత్వపు ఆధ్యాత్మిక సౌరభాలు

జై మహంకాళి జైజై మహంకాళి

డా.నమిలకొండ సునీత, కామారెడ్డి, 9908468171

Related posts

అమ్మా…ఎస్పీ అమ్మా మా మొర ఆల‌కించ‌వూ….!

Satyam NEWS

ముందు చూపులేని తనం తో ప్రజల్ని అంధకారం లో నెట్టారు

Satyam NEWS

పవిత్రమైన వైద్య వృత్తిని అపవిత్రం చేయవద్దు

Satyam NEWS

Leave a Comment