39.2 C
Hyderabad
March 29, 2024 14: 36 PM
Slider కవి ప్రపంచం

ముగ్గురమ్మల మూలపుటమ్మ

#B.Kala Gopal Nizamabad

సింహవాహినివై దుష్టులను దునుమాడ

ఇలపై వెలసిన చల్లని తల్లి

అమ్మా! దుర్గమ్మా! నీకీవే మా బోనాలు

నిమ్మకాయల నీరాజనాలు.. అగరొత్తుల ధూపాలు

బెల్లం సాక నైవేద్యాలు.. వేపమండల ఆశీర్వచనాలు

పోతురాజుల విన్యాసాలు గైకొనగ

అమ్మ దుర్గమ్మ బైలెల్లినాదిరో

శుంభనిశుంభుల దునుమాడి

రక్తబీజుని రక్తము తాగి

చండముండుల శిరములు ఖండించిన

రాజరాజేశ్వరివీ నీవే..!

ముజ్జగముల మూలపుటమ్మ చాల పెద్దమ్మగా

ముగ్గురమ్మల ఆదిపరాశక్తివీ నీవే..!

లోక కంటకుడైన మహిషుణ్ణి పీచమణిచి

సర్వేజనా సుఖీనోభవంతు అని అభయమిచ్చిన అంబికవూ నీవే

నీరూపు సర్వమంగళకరముగ..నీ చూపు మనోల్లాసముగ

మహామాయ!ఇలపై జనులను..చల్లగ చూడ ఆషాఢ మాసాన

ఇల్లిల్లూ చల్లగ వర్షాలతో సుభిక్షంగా నుండగ

మరొక్కమారు మారుమ్రోగంగా నీదు నామము

ముగ్గురమ్మల మూలపుటమ్మా! దుర్గాభవాని నీవే శరణం మాకు..!!

బి.కళాగోపాల్, నిజామాబాద్, చరవాణి 9441631029

Related posts

వైద్య కళాశాల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

Bhavani

గవర్నర్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

Bhavani

చంద్రబాబు కుటుంబాన్ని అవమానించడంతోనే వైసీపీ పతనం ప్రారంభం

Satyam NEWS

Leave a Comment