39.2 C
Hyderabad
April 25, 2024 15: 11 PM
Slider కవి ప్రపంచం

సంస్కృతికి ఆనవాళ్లు

#Ramakrishna Spandana

పసుపు,కుంకుమ తోడుగా పిండి పూసి

మట్టికుండను నిండుగా బొట్టుతో పూజించి

వేపాకులను అలంకారాలుగా అమర్చి

కంచుల్లో ప్రమిదను భక్తితో వెలిగించి

పట్టుపరికిణిలో పదహారణాల పడుచు

నెత్తిన బోనం ధరించి నడుచు..

బోనం లో వండిన అన్నం అమ్మవారి నైవేద్యం

మేనికి నలుగు పూసుకున్న పోతురాజు ఆహార్యం

డప్పుల దరువుల్లో.. చిన్నారుల చిందుల్లో

పూనకంతో ఊగిపోతూ.. అమ్మ వారి ఆనతితో

రంగంలో భవిష్యత్తు చెప్పుతూ.. భరోసా ఇస్తూ

రంగురంగుల్లోని ఘటాలను అమ్మవారికి సమర్పిస్తూ

ఇంటిల్లిపాదీ ఇష్టంగా మొక్కే గ్రామ దేవతలు

మైసమ్మ.. మహంకాళి.. ముత్యాలమ్మ

చల్లంగా చూడు తల్లి చక్కని తల్లి అంటూ..

ఆషాడపు బోనాలతో అమ్మవారికి

గొర్రెలు మేకలు కోళ్లను ఆర్తితో బలి ఇచ్చి

ఊరు చల్లంగుండాలని ఊరంతా చేరి

ఉత్సాహంతో చేసే బోనాలు.. మన సంస్కృతికి ఆనవాళ్లు..!

-రామకృష్ణ స్పందన, రీసెర్చ్ స్కాలర్, ఉస్మానియా యూనివర్సిటీ, 9494353828

Related posts

మత మార్పుడులకు రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి అబ్బ జాగీరా

Satyam NEWS

పేదవారికి నిత్యావసరాలు పంచిన మార్కండేయ సేవా సమితి

Satyam NEWS

పన్నులతో పట్టణ, నగర ప్రజల నడ్డి విరుస్తున్న జగన్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment