27.7 C
Hyderabad
April 18, 2024 08: 56 AM
Slider కవి ప్రపంచం

సెల్లి చంద్రమ్మ బోనమెత్తింది..

#K.Haranath

బోనాల జాతరొచ్చింది

లష్కర్ బోనాల జాతరొచ్చింది

సెల్లి చంద్రమ్మ బోనమెత్తింది

సల్లంగ సూడమ్మ

జగజ్జనని ఉజ్జయిని

సింహవాహిని

లాల్ దర్వాజ

సికిందరాబాద్ ల కొలువైన

మాతల్లి

సల్లంగా సూడమ్మ పెద్దమ్మ

ఆషాఢ మాసాన నీ కోసమే

కొత్త కుండలో బోనమొండింది

పాలు బెల్లమన్నం

నైవేద్య మర్పింప

సెల్లి చంద్రమ్మ బోనమెత్తింది

దయ చూపి రోగాలు బాపి

  కరుణించి దీవించు

     మా యమ్మ

వానల్లు కురిపించి పంటలు పండించి

ధాన్యలక్ష్మివై కొలువుండమని

సెల్లి చంద్రమ్మ బోనమెత్తింది

కాళివైనా మహంకాళివైనా

మావూరి దేవత నీవమ్మా

యెల్లమ్మ మైసమ్మ నీవేనమ్మా

పోచమ్మ పెద్దమ్మ  నీ

రూపమని

సెల్లి చంద్రమ్మ బోనమెత్తింది

అమ్మకి బొనమివ్వంగ

పోతురాజు వీరంగ నాట్యాలు

కొరడా దెబ్బలకై

పాకులాడు ప్రభంజనం

లాల్ దర్వాజ గల్లీ గల్లీ

మాతోత్సవ సంబురాలు

సెల్లి చంద్రమ్మ బోనమెత్తింది

ఊరి పీడ విరగ

భవిష్యవాణి రంగం

విశ్వమానవ మనుగడకు

అంబ పలుకు జగదంబ పలుకుమని

సెల్లి చంద్రమ్మ బోనమెత్తింది

కె.హరనాథ్,   9703542598

Related posts

సామాజిక న్యాయం అందించడంలో సుప్రీం వెనకడుగు

Satyam NEWS

బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేసిన ఇందిరాగాంధీ

Satyam NEWS

వెయిటింగ్:భారత్ పర్యటనకై ట్రంప్ ఆసక్తి

Satyam NEWS

Leave a Comment