34.2 C
Hyderabad
April 19, 2024 22: 45 PM
Slider కవి ప్రపంచం

సింహవాహిని

#Nellutla Sunitha

ఆషాడం అంటేనే..

బోనాల కోలాహలం.!

సింహవాహిని అమ్మవారి ఆరాధన ఆరంభం

ఆ తొమ్మిది రోజుల పర్వదినం..

భక్తజన సంద్రమై పాతబస్తీ నేడు..

ఓహో వీర…. అంటూ…! పోతురాజు ఆహార్యం….!

ఆ డప్పుల దరువులు..

కొరడా దెబ్బలు… బోనం అంటే

భోజనం గా భావించి..

సింహవాహిని అమ్మవారికి..

వేపాకులు అలంకరించి..

కల్లు శాక  ఆరబోసి….

మా.. తుజే …ముజే.. అర్పన్…

అని

బోనం చెల్లిం చుకుంటూ..

గండదీపం ఎత్తుకొని…

ముందుకు ..నడిపించమని..!

అమ్మని వేడుకొని..

కార్మికుడు .కర్షకుడు. శ్రామికుడు.

పెద్ద చిన్న బీద సాద తేడా లేక..

జరుపుకునే మన రాష్ట్ర పండుగ.. తెలంగాణ కళారూపాలు..

హరికథలు బుర్రకథలు.

కవిసమ్మేళనాలు…

రంగం కార్యక్రమంలో అమ్మవారు పూనుకొని..

బహు బాగుగా  జాగ్రత్త లు  చెబుతుంది.

ప్రపంచ శాంతిని నెలకొల్పాలని..

శాంతి కల్యాణం జరిపి అమ్మకు..

పోతురాజు స్వాగతం పలుకుతూ…

మహాభిషేకం జరిపి..

కంచికి ఊరేగింపుగా అమ్మని

తోడుకొని పోయి…

చరిత్ర శిఖరం లో నిలిచిన..  

తెలంగాణ సాంస్కృతిక సంపద..

లాల్ దర్వాజా బోనాలు పండుగ

అమ్మనే సత్యం..

అమ్మ నే నిత్యం..

అమ్మ నే ధర్మం..

సాత్వికుల శాకాంబరి..

సింహవాహిని అమ్మవారికి జేజేలు.!!

నెల్లుట్ల సునీత, 7989460657

Related posts

వీరపల్లె లో భత్యాల చీరలు దుప్పట్లు పంపిణీ

Satyam NEWS

జనజీవన స్రవంతిలోకి వచ్చే మావోలకు సహకరిస్తాం

Satyam NEWS

దేశంలోనే తొలి “సైకోమెట్రిక్ విద్య” రాష్ట్రంగా తెలంగాణ

Satyam NEWS

Leave a Comment