27.7 C
Hyderabad
April 25, 2024 07: 49 AM
Slider కవి ప్రపంచం

జగజ్జనని

#Nannapuraju Vijayashree

మము కాపాడే మహిమాన్విత మహంకాళి

ఆఫాడ మాసాన బోణాల తోరణాల సంబరం

అంబరాన్ని తాకింది అమ్మా మహంకాళీ రౌద్రాన్ని

ప్రతిబింబిస్తు శాంతింపగ రావమ్మ కొత్త కుండతో

పసుపు కుంకుమతో అలంకరించి అఖండ దీపంతో

యాపకొమ్మ లతో పూలతో చిన్న ముంతలో కల్లు బెల్లం సాక గుమ్మడి కాయ తో

బెల్లంబువ్వ నైవేద్యంతో

డోళ్ళు డప్పుల సప్పుళ్లతో శివసత్తుల రౌద్రం తో

పొతరాజులఉగ్ర రూపాలు కొరడాలతో

ఫలహారపుబండ్లతో తొట్టెలతో అలంకరించుకొని

పచ్చి కుండపై భవిష్యవాణి పలుకులతో రంగం

రంగరంగ వైభవంగా రాణించే

దుష్టుల సంహరించే ధీర చరిత్ర శిష్టులకాపాడే పుణ్య చరిత్ర అమ్మా నీవు దేహాళివై కాళివై మనుషుల్లో మానవతను పెంచే మహం కాశివై మము కాపాడు తల్లి

-నన్నపురాజు విజయశ్రీ, జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలు, రంగారెడ్డి జిల్లా, 910043988 4

Related posts

నా తెలుగు

Satyam NEWS

లోకేష్ కు టిడిపి పగ్గాలు?

Satyam NEWS

పెంచిన ఇంటి పన్నులు తగ్గించాల‌ని టీడీపీ నిర‌స‌న‌

Sub Editor

Leave a Comment