31.7 C
Hyderabad
April 24, 2024 23: 22 PM
Slider కవి ప్రపంచం

దీపావళి గజల్

#MuluguLaxmimaidhili22

ఆశ్వీయుజ మాసంలో
వచ్చెనులే దీపావళి
చీకట్లను పారద్రోలి
మెరిసెనులే దీపావళి

ముంగిట్లో దివ్వెలన్ని
కాంతులనూ వెదజల్లెను
ఆనందపు సంబరాలె
తెచ్చెనులే దీపావళి

తెలుగువారి లోగిళ్లలొ
చిన్న పెద్ద మురిసిపోయె
అవనిఅంత సంతోషము
పంచెనులే దీపావళి

ప్రతి ఇంటా సందడులే
ఊరంతా చిరు దివ్వెలు
భారతీయ సంస్కృతినే
మెచ్చెనులే దీపావళి

అమావాస రాతిరి లో
ధనలక్ష్మిని పూజించితి
విజయానికి ప్రతీకగా
నిలిచెనులే దీపావళి!

Related posts

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కుటుంబంతో సహ ఆత్మహత్య

Satyam NEWS

ఏపీలో ఉన్నది ప్రభుత్వం కాదు గుండా రాజ్యం

Satyam NEWS

మీడియా హైప్ తప్ప గ్రౌండ్ లెవెల్లో ఏదీ?

Satyam NEWS

Leave a Comment