34.2 C
Hyderabad
April 19, 2024 20: 53 PM
Slider కవి ప్రపంచం

అప్పుడే పండుగ‌..

#TirunagariSrinivasNew

ఎద‌గ‌డ‌మే కాదు
ఒద‌గ‌డం తెలిస్తేనే
మ‌నిషి జీవితానికి
అది అస‌లైన పండుగ

కుంచించ‌డం కాదు
విస్త‌రించడం తెలిస్తేనే
మ‌నిషి జీవితానికి
అది అస‌లైన పండుగ‌

క‌టిక చీక‌టిలోనూ
కాంతిరేఖ‌గా ప‌ల్ల‌విస్తేనే
మ‌నిషి జీవితానికి
అది అస‌లైన పండుగ

ఎల్లలు లేని
ఎల్ల లోక‌పు
మాన‌వ‌తా రూప‌మైతేనే
అది అస‌లైన పండుగ

నీడ‌ల దృశ్యాలు అంత‌రించి
మ‌నిషి అడుగు జాడ‌లు
వెలుగు తోర‌ణాలైనప్పుడే
అది అస‌లైన పండుగ

  • తిరున‌గ‌రి శ్రీ‌నివాస్
    8466053933

Related posts

లారీ క్యాబిన్ లో ఎసీ తప్పనిసరి

Bhavani

ఘ‌నంగా అల్లూరి సీతారామ‌రాజు 125వ జ‌యంతి వేడుక‌లు

Satyam NEWS

తితిదే ఈవో ధర్మారెడ్డికి జైలు శిక్ష

Bhavani

Leave a Comment