27.7 C
Hyderabad
April 20, 2024 01: 01 AM
Slider కవి ప్రపంచం

దివ్వదీపావళి

#vaddepallikrishan new

దీపావళి దీపావళి

దివ్వమైన దీపావళి

నాకు నీకు అందరికి

నవ్వమైన శోభావళి దీ

అధికధరల నరకాసురు

నంతము చేసిన నాడే

అవినీతుల నణగద్రొక్క

పంతము పట్టిన నాడే

మమతలనే ‘మతాబాలు’

చిరునవ్వుల ‘చిచ్చుబుడ్లు’

ప్రతి ముంగిట వెలుగులతో

ప్రజ్వలించు సుదినమ్మున దీ

అమెరికా దేశమైన

ఆంధ్రావని ప్రాంతమైన

అరమరికలు లేకుండా

అనురాగం పోకుండా

కలిసి బ్రతికినప్పుడే

కథగ మసలినప్పుడే

పెనుచీకటి తెరలు తొలగి

ప్రేమ వెలిగినప్పుడే దీ

వడ్డేపల్లి కృష్ణ

Related posts

వేములవాడలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి

Satyam NEWS

ఏటూరునాగారం రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

Satyam NEWS

దేశానికి సాంకేతిక విప్లవం తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ

Satyam NEWS

Leave a Comment