18.3 C
Hyderabad
December 6, 2022 05: 43 AM
కవి ప్రపంచం

చైతన్య దీపావళి

#PattemVasantha

ఆశ్వీయుజ అమావాస్య రోజున
బహుళ చతుర్థినే నరక చతుర్దశి
చీకటి వెలుగుల రంగేళి దీపావళి
దీపం పరబ్రహ్మ స్వరూపంగా
అజ్ఞాన చీకట్లను పారద్రోలే జ్ఞానానికి ప్రతీక
జగతిని జాగృతం చేసే చైతన్య దీపావళి
నరకాసుర సంహార పీడను తొలగిస్తూ
చెడుపై మంచి విజయానికి చిహ్నంగా
అందాల ప్రమిదల వరుస దీప కాంతులు
కమ్మనైన తీపి వంటకాల అరగింపులు
లక్ష్మీదేవి, కేదారేశ్వర వ్రతాల పూజలతో
ఐశ్వర్యానికి సంకేతం ఈ దీపావళి
ఆ బాల గోపాలానికి ఆనందాల హరివిల్లు
నేటి దీపావళి బాణాసంచా చప్పులు
ధ్వని వాయు కాలుష్యాల హోరుకు…
విలవిలలాడుతున్న ధరణి…
పర్యావరణాన్ని పరిరక్షించుదాం..
కాలుష్యాన్ని అరికడదాం…..
.రోజురోజుకీ పెరుగుతున్న నరకాసురులు
చిదుమబడుతున్న చిన్నారులు….
ప్రతి స్త్రీకి కావాలి సత్యభామ స్ఫూర్తి
ప్రతి ఇంటా చిరునవ్వుల దీపాలు వెలగాలి

పత్తెం వసంత కరీంనగర్

Related posts

ఎదురీతలోనే ఆమె!

Satyam NEWS

తెలుగు వత్సరం

Satyam NEWS

2021

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!