38.2 C
Hyderabad
April 25, 2024 13: 06 PM
Slider కవి ప్రపంచం

దివ్య దీపావళి

#Puli Jamuna New

నింగిలోని తారలన్నీ నేలకు దిగి వచ్చిన వేళ
కార్తీక మాసాన కమనీయ కాంతుల హేళ
కేదారీశ్వర సత్యనారాయణ వ్రతాచరణతో
హరిహరులను ఆరాదించే కార్తీక మాసం

చెడుపై విజయం తథ్యమని తెలుపుతూ
కష్టసుఖాలకు కలిమి లేములకు ప్రతీకయై
చీకటి వెలుగులతో జీవన సందేశమిస్తూ
సంతోష సౌరభాలను వెదజల్లే దీపావళి పర్వం

దీపపు జ్యోతి వరదాయినియై
అజ్ఞాన తమస్సును తరిమి వేసి
చైతన్య దీప్తులతో జ్ఞానప్రాప్తిని ప్రసాదిస్తూ
జగతిని ధవళ కాంతులతో జాగృతం చేస్తుంది

కలువలరేడు కౌముది సుధలు కురిపించగా
చల్లని వెన్నెల కిరణాలు హృదిని తాకి
మది వాకిటిలో మధుర భావ పరిమళమై
లోగిళ్ళలో ఆనందాల హరివిల్లై విరిసింది

ధరణి నిండా నిండిన శరత్ చంద్రికా తళుకులతో
అవని అధ్బతమైన అందాలతో శోభిల్లగా
ముంగిళ్ళలో జిలుగువెలుగుల దీపతోరణాలతో
ఆబాలగోపాలాన్ని హర్షాతిరేకంతో అలరించేపర్వం

పులి జమున మహబూబ్ నగర్ 8500169682.

Related posts

వనపర్తి జిల్లాలో జాతీయ స్థాయి పర్యవేక్షణ బృందం పర్యటన

Satyam NEWS

ఈచ్ వన్ టీచ్ వన్ కు BTA సంపూర్ణ మద్దతు

Satyam NEWS

బాలు ఆత్మ శాంతించాలంటే?

Satyam NEWS

Leave a Comment