34.2 C
Hyderabad
April 19, 2024 20: 15 PM
Slider కవి ప్రపంచం

ఆ వెలుగులకే నా ప్రస్థానం

#shyamalanew

వెలుగుల వేల్పు వీడ్కోలు చెప్పాడో లేదో
వీధులంతటా సరికొత్త వెలుగుల కళ
ఇంటింటా దివ్వెల దివ్య హాసాలు
ప్రజ్వలించే ప్రమిదల ప్రకాశాలు
కొవ్వొత్తుల మిసిమి కాంతులు
విద్యుత్ వెలుగుల విలాసాలు
రంగుల బల్బుల దాగుడుమూతలు
ఇంతటి వెలుగుల అందాలకు
నా కళ్ల వాకిళ్లు ఆనందాల లోగిళ్లయిన వేళ
ఎదురుగా నిలిచాడు ఓ కళ్లులేని కబోది
వెలుగులను కనలేని అతడిని చూసి
నాదెంత అదృష్టం..అంతరంగ భావన!
కానీ మరు క్షణమే..
బాహ్య కాంతులకు అంతగా మురవకు
స్వార్థం, అసూయ, కపటం, కుటిలం
ఎన్నెన్నో చిమ్మ చీకట్ల గుయ్యారం నీ హృదయం
అతడి అంతః చక్షువుల వెలుగుల ముందు
కళ్లుండీ కబోదివే నీవు
మదిలో దీపం వెలిగించు
మనిషై నువ్వు భాసించు
మేల్కొల్పిన అంతర్వాణి
ఆ వెలుగులకే నా ప్రస్థానం!!

జె.శ్యామల

Related posts

పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర వార్షిక బడ్జెట్ లో చర్యలు

Satyam NEWS

సమాచార హక్కు చట్టం కాలమానిని ఆవిష్కరణ

Satyam NEWS

డీజీపీ హత్య: కొత్తగా పుట్టిన ఉగ్రవాద సంస్థ TRF పనే

Satyam NEWS

4 comments

Gannavarapu+Narasimha+Murty October 24, 2022 at 2:06 PM

దీపావళి మీద గేయం వెలుగులు నింపినట్లు ఉంది
రచయిత్రికి అభినందనలు

Reply
Satyam NEWS October 25, 2022 at 12:10 AM

Thank you

Reply
Pushpa October 27, 2022 at 12:22 PM

Dipavali geyam chala bagundi madamki dhanyavadaalu

Reply
Satyam NEWS October 27, 2022 at 9:24 PM

ధన్యవాదాలు

Reply

Leave a Comment