31.7 C
Hyderabad
April 25, 2024 00: 03 AM
Slider కవి ప్రపంచం

చాక్ పీస్

#Ch.Usharani Chandanagar

అమ్మ ప్రతీఅక్షరానికి  వేగుచుక్క

అమ్మ పొత్తిళ్ళు దిద్దించిన ఈ చాక్పీస్,

పలకాకు రుద్దీ రుద్దీ తళుక్కుమనే బొర్ద్ పై

ఓనమాల మాలికలు,చెంగల్వ పూదండలు పెనవేసుకుపోతుంటాయి.

ఎంకి కొప్పులో విరజాజులై సువాసనల్ని వెదజల్లుతాయి. 

మాత్రిక,పౌనః పున్యాల అంకెలు పరుచుకున్నపుడు,

సుడులు తిరిగే సమస్యలకు రూపకల్పన జరుగుతుంది.

సైన్స్ చేతిలో పడి వాయువు,ఘన,ద్రవ రూపకల్పన కళ్ళకు చూపుతుంది.                            

అణు-పరమాణు విచ్ఛేదన జరిగాక-పట్టపగలే నక్షిత్రాల ఆవిష్కరణ జరుగుతుంది. 

సార్-చక్పీస్ తేరా!అన్నప్పుడల్లా అనుకరణలు,అభినయాల పరకాయ ప్రవేశం చేస్తూ ఆఘమేఘాలవుతాము. 

చాంతాడంత నైలునది ప  వాహకంపై తేలిన కొంగల దోరలా అక్షరాలు-

ఎగురుతూ మా తరగతంతా తిరుగాడతాయి.

చిక్కటి అమేజాన్ అడివిలో మిణుగురుల ప్రవాహమే

ఈ చాక్పీస్ అక్షరాలు.

ఈజిప్ట్,మెహంజదారో చరిత్ర మా పాత గుడికాడి రావాకుల గలగలల్లా వినవడతాంది

అంబుల పొదిలా నిండిన ఈ బోర్డు-బాణాల్లా తీక్షణ మవుతాయి. 

గాలి మంత్రించిన కొమ్మల్లా ఎటూ కదల లేము

చుక్కల్ని పొదివి పదుతూ ఆ వేలికొసలు సాగిపొతుంటాయి.

భూమిని పెకిలిస్తూన్న సన్నటి మొలకల్లా ఈ లేత అక్షరాలు.

చరిత్రలొ మునిగి తేలిన ఒకడు దేశ సైనికుడు అవుతాడు 

కొండల మద్య సూర్యొదయపు చిత్ర కళాకారుడు అవుతాడు ఒకడు      

మా సానకై సాగుతున్న వజ్రపు రజునులా చాక్పీస్ సాగిపోతుంటుంది.  

కొత్త పుంతల్లొ కలంగామారి మైలురాళ్ళను దాటుతుంది.

సవాలక్ష ప్రశ్నలకు కేంద్రబిందువు అవుతుంది ఈ సుద్ధ ముక్క.

ప్రపంచానికి అక్షర దండొరా వేస్తుంది ఈ చాక్ పీస్. 

పాదలపై చిన్న మంచుతుంపరై వినమ్రంగా రాలుతుంటుంది

(అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా)

సిహెచ్ ఉషా రాణి  9441228142

Related posts

వాట్సాప్ ద్వారా ఐఐటీ, నీట్ ఫౌండేషన్: ఎడ్యు గ్రామ్

Satyam NEWS

రోడ్డు ప్రమాదంలో డెలివరీ బాయ్ మృతి

Bhavani

బర్త్ డే గిఫ్ట్: శాంతిభద్రతలకు చిహ్నంగా పచ్చని మొక్క నాటిన సీఐ

Satyam NEWS

Leave a Comment