39.2 C
Hyderabad
April 25, 2024 18: 00 PM
Slider కవి ప్రపంచం

అమ్మ భాష కమ్మదనం

#Doraveti

పల్లవి: తెలుగే వెన్నెల వెలుగు

           తెలుగే వేకువ పులుగు

           తెలుగు పలుకులే పలుకు …మన ll తెలుగు ll

           తెలుగు భాష తో ఎదుగు llతెలుగే ll

1చరణం: 

అమ్మ మోము నుండి జారే

అమృత గుళిక  తెలుగు

అమ్మ గోరు ముద్దల లోని

కమ్మదనం తెలుగు

అమ్మ ఒడి ఆటే తెలుగు

అమ్మ నోటి పాటే తెలుగు

నేర్వకనే నేర్పులు నేర్పే నెచ్చెలి మన తెలుగు….llతెలుగే ll

2 చరణం:

రాజభాషలో విజయఘోషలో

రంజిల్లిందీ తెలుగు

పాదపూజలూ పల్లకి సేవలు

 అందుకున్నదీ తెలుగు

పోతన్న నాదం తెలుగు

వేమన్న వేదం తెలుగు

తరతరాల ఈ జాతి చరిత్రకు

అద్దం మన తెలుగు…ll తెలుగే ll

3చరణం:

జానపదుల గానం లోని

జాజిమల్లె తెలుగు

కళారూపకాల్లో దొరికే

కమ్మతేనె తెలుగు

శృంగార దీపం తెలుగు

అంగార రూపం తెలుగు

ఉప్పెనలైన ఉద్యమాలకు

ఊపిరి మన తెలుగు…ll తెలుగే ll

దోరవేటి

Related posts

ఆయిల్ పామ్ సాగు ప్రోత్సహించాలి

Murali Krishna

Analysis: కరోనా కంగనా మధ్యలో శివసేన

Satyam NEWS

కేసీఆర్ ప్రభుత్వంపై గవర్నర్ తీవ్ర ఆరోపణలు

Satyam NEWS

Leave a Comment