32.7 C
Hyderabad
March 29, 2024 12: 39 PM
Slider కవి ప్రపంచం

తెలుగు పూలతోట

#Puli Jamuna

నిర్మలమైన మరుమల్లెల విరిజల్లులా

ఎల కోయిల కూజిత స్వనములా

అలతి అలతి పదాలతో అక్షరాలనల్లి

లలిత లలిత భావాలను ఒలికిస్తూ

మధురాతి మధుర మైనది తెలుగు భాష

మందార మకరంద మాధుర్యాలతో

పద్యకవితా మధురిమలతో

మదిని దోచి మైమరపించు తెలుగు భాష

నానుడులు పలుకుబడులు

నుడికారపు సొంపులతో

సామెతలు సర్వాలంకారాలతో

మట్టి పరిమళమై తట్టిలేపి తటిల్లతలా

మెరుపు విరుపులతో కట్టిపడేసే

తలకట్టు తలమానికమైన

సకల కళల కల్పవల్లి తెలుగు భాష

సరిగమల సుస్వర రాగాలతో

సుధారస రాగ రంజితమై

సుమనోహర రసగంగా తరంగమైన

సంగీత సారస్వత సామ్రాజ్ఞి తెలుగు

జాన పదాల జాను తెలుగు మాటలతో

జాతీయాలతో జనజీవనాడియై

జ్ఞానసుధలు జాలువార

జనహృది పరవశమొందే తెలుగు భాష

హరిచందన సురభిళ చందమై

సౌరభాలను వెదజల్లుతూ

రసరమ్య వినోదాలతో వినోదభరితంగా

విజ్ఞాన కలితంగా వెలుగొందు తెలుగు

తరతరాల తెలుగును నరనరాన నిలిపి

యుగయుగాలకు వెలుగునిచ్చేలా

అమ్మభాషను అమరం చేద్దాం

(అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా)

పులి జమున, మహబూబ్ నగర్ 8500169682

Related posts

రేపు కామారెడ్డికి కేటీఆర్ రాక: 10 వేల మంది కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం

Satyam NEWS

చర్లపల్లి చెరువు వద్ద సూర్యభగవానుడి దేవాలయ నిర్మాణానికి చర్యలు

Satyam NEWS

నిరుద్యోగ భారతం: రోజు రోజుకూ తగ్గుతున్న ఉద్యోగావకాశాలు

Satyam NEWS

Leave a Comment