35.2 C
Hyderabad
April 24, 2024 13: 19 PM
Slider కవి ప్రపంచం

నా తెలుగు

#PattemVasantha

అమ్మ పాల కమ్మదనం నా తెలుగు

పిలుపు లోని మాధుర్యం నా తెలుగు

పెరుగన్నం మీగడ పలుకులు నా తెలుగు

ఆవకాయ రుచుల ఆకలింపు నా తెలుగు

అలవోకగా నేర్చుకునే   నా తెలుగు

ఆకలిదప్పులను మరిపించే నా తెలుగు

ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్  గా  నా తెలుగు

ఆత్మీయతను అందిపుచ్చే నా తెలుగు

అమ్మ ఒడిలోని లాలి పాటలు నా తెలుగు

నుడి కారపు సొంపులు ఉన్న నా తెలుగు

అజ్ఞానాన్ని తుంచి జ్ఞానాన్ని పెంచే నా తెలుగు

తేనెలురించు ప్రియ భాషణం నా తెలుగు

యాస ప్రాసలు మేళవితమైన నా తెలుగు

అలంకార సోయగాల నా తెలుగు

నానుడి పలుకుబళ్ళుతో వికసించిన నా తెలుగు

చరిత్రలో మైలురాయిగా నిలిచిన నా తెలుగు

స్నేహ పరిమళాల గుబాళింపు నా తెలుగు

వికసించే పుష్పం లాంటి నా తెలుగు

సాంప్రదాయానికి కలికితురాయి నా తెలుగు

నడవడికకు మార్గం ఇచ్చినా తెలుగు

అన్నింటా ఎన్నిటికో వెలుగు చూపు నా తెలుగు

సమతా మమతల సంకలనం నా తెలుగు

విశాల జీవనమాధుర్యానికి రూపం నా తెలుగు

విశ్వవ్యాప్త ఆత్మబంధువు నా తెలుగు

నేడు పరభాషా మోజుతో అంతరిస్తున్న నా తెలుగు

ప్రాచీన భాషలకు జీవన ఆధారం నా తెలుగు

విశ్వమానవాళికి గర్వ కారణం కావాలి నా తెలుగు

(అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా)

పత్తెo వసంత, కరీంనగర్

Related posts

ఏ అధికారంతో అంబులెన్స్‌లు ఆపారు?

Satyam NEWS

మంథని అడవుల్లో ఆరు పెద్ద పులులు

Satyam NEWS

ఆర‌వ విడ‌త‌ హరితహారాన్ని విజయవంతం చేయాలి

Satyam NEWS

Leave a Comment