36.2 C
Hyderabad
April 25, 2024 22: 44 PM
Slider కవి ప్రపంచం

తెలుగు వెలుగు

#Dr,Katikojhvala

తెలుగు తెలుగు తెలుగు 

అక్షరాల తెలుగు

జిలుగు జిలుగు జిలుగు

ఇది పరిఢవిల్లు పులుగు

అడుగు అడుగు అడుగు

అది సరళానికి ముందడుగు

వ్యవహారిక పిడుగు గిడుగు

గురజాడల వడివడి అడుగు

తెలుగుకు మణి తొడుగు

వెలుగు వెలుగు వెలుగు

దేవరాయ లెస్స తెలుగు

విశ్వనాథ విశ్వ తెలుగు

కాళోజీ కలల తెలుగు

శ్రీనాధుని పద్య తెలుగు

రామదాసు కృతులు తెలుగు

చిన్నయసూరి కథలు తెలుగు

మధుర కవన మొల్ల తెలుగు

కూచిపూడి ఆట తెలుగు

కృష్ణా గోదావరి తుంగ భద్ర

బిర బిర బిర ప్రవాహ ఝరులు

చెర చెర చెర “చేరా”లు

గల గల గల పారే అక్షర సిరులు

మనసు దోచు సరిగమల స్వరులు

ఆది కవి నన్నయ అక్షరాలు

అన్నమయ్య త్యాగయ్యల పదసడులు

పోతన భాగవత బాండాగారాలు

ఘంటసాల గానాలు సాలూరు రాగాలు

ఆత్రేయ పురాలు దాశరథి శరాలు

వట్టికోట వరాలు రాబోవు తరాలు

మనవే మనవే మనవేనోయ్..!

(అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సందర్బంగా)

డా.కటుకోఝ్వల రమేష్, చరవాణి:9949083327

Related posts

ఆత్మకూరు ప్రాంతంలో పెద్ద పులి పిల్లల కలకలం

Satyam NEWS

అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం

Satyam NEWS

తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి నాలుక కోయాలి

Satyam NEWS

Leave a Comment