28.7 C
Hyderabad
April 20, 2024 05: 05 AM
కవి ప్రపంచం

అమ్మ పలుకు

#NutenkiRavindar22

అమ్మ పాల కమ్మదనం

నాన్న మురిపాల మూలధనం

తోబుట్టు ప్రేమల అనుబంధం

తీగసాగిన రక్తసంబంధాల

రాగ సుగంధం

ఆలుమగల అనురాగం లోని

ప్రణయ ప్రబంధం

కన్న పిల్లల ఆనందాల హరివిల్లుల వల్లరి

కన్నెపిల్ల కొంటెచూపు సోయగాల అల్లరి

అమ్మ పలుకు నందే

అందమైన పెన్నిధి

అమ్మ పిలుపు లోనే

అద్భుతాల సన్నిధి

మమకారాల నుడికారాలు

కారాలూ మిరియాల వెటకారాలు

సామెతలూ జాతీయాలు పలుకుబడులు కొల్లలు

పొడుపుకథల చిక్కుముడులకు

లేనె లేవు ఎల్లలు

హృద్యమైన పద్యాలు

స్వంతమైన అవధానాలు

విభిన్న ప్రక్రియల గులేబకావళి

విశేష ప్రత్యేకతల నిత్య దీపావళి

యాభయ్యారు అక్షరాల అక్షయ పాత్ర యిది

సాహితీ సౌరభాల సాంస్కృతిక యాత్రే మరి!

నూటెంకి రవీంద్ర, లక్షెట్టిపేట, 9491533295.

Related posts

శ్రామిక నినాదం

Satyam NEWS

అక్షరాశృతర్పణం

Satyam NEWS

సగర్వంగా చాటుదాం..

Satyam NEWS

Leave a Comment