37.2 C
Hyderabad
April 19, 2024 14: 32 PM
Slider కవి ప్రపంచం

మాతృ దేవత

#Nellutla Sunitha New

అమ్మ తోడుంటే చాలు

ఏ  ధన ధాన్యాలు ఎందుకు?

అనంత నీలాకాశంలో ని

బరువంతా అంతః క్షేత్రంలో దాచి

నీ ఊపిరి ఆగిన మెరుపుల పోరాటంతో

పురిటినొప్పులు ని దాటి

ఉనికే లేని పిండానికి  ఊపిరి ని ఇచ్చి!

నీ కంటి రెప్పలలోనా రూపాన్ని చూసి మురిసిపోయావు  అనురాగ దేవతగా

నీ తనువుతో పెనవేసుకుని

నీ తలపుల మనసుతో ముడి వేసుకుని

పేగు బంధమై రూపం ఇచ్చావు నాకు

సృష్టి రహస్య వర్ణ చిత్రాలకు ప్రతిరూపంగా నిలిచావు

నీ మమతానురాగాల మాధుర్యములు పంచే అమృతమూర్తిగా నిలిచి

నా కడుపు నిండిందో లేదోనని చూసిన నీ అమ్మతనం ఎంతో కమ్మదనం కదమ్మా

నా కోసం నీ కోరికల్ని శ్రమను త్యాగం చేసి త్యాగశీలివి

నీ అనురాగాలు ఆత్మీయతలు పంచిన కల్పవల్లివి!

నీ శ్రమలోనే నా సంతోషాన్ని వెతికి

నా భవిష్యత్తుకు బాటలు వేసిన మార్గదర్శి  గా తొలి గురువు గా జ్ఞానం పంచిన

సుజ్ఞానీవి

పాలకడలి చిలికినప్పుడు అమృతం వచ్చినట్లుగా!

నేను ఎంత ఈసడించుకున్నా

నీ లోంచి ప్రేమ అమృతం   నిరంతరం వస్తూనే ఉంటుంది. కదమ్మా

నీ ప్రేమని అక్షరాలలో బంధించి

చూపించలేని ది!

ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేనిది!

నీకోపం లోనైనా నా మంచిని కోరుకునే దేవతవి కదా

నీ గురించి చెప్పాలంటే పదాలు సరిపోవు భాషలు చాలవు!

అనంతమైన అచంచలమైన నమ్మకమే అమ్మ… అమ్మ… మా ఇంటి దేవత  నా శకుంతలమ్మకు అంకితం!!

(మాతృ దినోత్సవం సందర్భంగా నా కవితా కుసుమాలు అమ్మకు అంకితం)

నెల్లుట్ల సునీత, ఖమ్మం, చరవాణి : 7989460657

Related posts

33 మంది మిలీషియా సభ్యుల లొంగుబాటు

Sub Editor

కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలి

Satyam NEWS

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించాలి

Bhavani

Leave a Comment