27.7 C
Hyderabad
April 25, 2024 09: 04 AM
Slider కవి ప్రపంచం

జీవనది

#KolipakaSrinivas

తన దేహాన్ని వరంలా మారుస్తూ

మరో ప్రాణానికి రూపాన్ని ఇస్తూ..

నిండుతనంతో సత్తువను నింపే ఊపిరివై

అస్తిత్వానికి చిరునామాగా నిలుస్తోంది

ఆ స్త్రీ మూర్తి ఓ..తల్లిగా ఈ విశ్వానికి..!

కుటుంబమనే ఇంటికి జ్ఞానజ్యోతుల

వెలుగులను  పంచె తేజోయశస్సు

అహర్నిశలు అందరికోసం తన

శ్రమశక్తిని సర్వము ధారపోస్తుంది

కుటుంబ బాంధవ్యాన్నికి మహావృక్షమై

ఎల్లవేళలా తాను చల్లని నీడవుతూ

కాలే కడుపు ఆకలి తీర్చే అన్నపూర్ణ

వెలుగు చీకటిలా కష్టాలను సుఖాలను

సమదర్శిగా భావించే కరుణామూర్తి

ఏలాంటి ఫలమాశించక కుటుంబానికి

ఫలాలను అందించే కల్పతరువు అమ్మ

నీడలా నిజాల కాంతి వైపు నడిపించే

బాధ్యత కలిగిన పావనమూర్తి అమ్మ

సంపూర్ణ మూర్తిమత్వానికి అండగా నిలుస్తూ 

కర్తవ్యం విధినిర్వహణలో కవచమవుతుంది

అనునిత్యం తన పాదాల నడకలతో అనంతానందాన్ని పంచుతూ కుటుంబంకై

ఏ స్వార్థము చూపక సాగిపోయే జీవనది

అలుపంటూ లేని యోధురాలు అమ్మ

ఈ విశ్వంలో ఎన్నో అంతరాలను

అధిగమిస్తూ గెలిచి నిలుస్తోంది

తనకు తానుగా చైతన్యాన్ని సృష్టిస్తూ

విశ్వానికి తానే విశ్వమై నిలుస్తుంది..!!

కొలిపాక శ్రీనివాస్, 9866514972

Related posts

ఎనాలసిస్: కరోనాతో సహజీవనానికి సిద్ధమౌతున్న దేశం

Satyam NEWS

Special interview: ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అవసరమా?

Satyam NEWS

మొహం చాటేస్తున్న రాజధాని ప్రాంత వైసిపి ఎమ్మెల్యేలు

Satyam NEWS

Leave a Comment