28.7 C
Hyderabad
April 25, 2024 05: 11 AM
Slider కవి ప్రపంచం

అమ్మ ఎప్పుడూ ఆశ్చర్యమే !

#Inampudi Sri Laxmi

“అమ్మా! నువ్వు ఇంత అందంగా ఎలా ఉన్నావు?”

 మా అమ్మాయి ఉత్సాహంగా అడిగింది !

“అమ్మమ్మా! నువ్వు ఇంత అందంగా ఎలా ఉన్నావు?”

 మా మనవడు కుతూహలంగా అడిగాడు!

 “నానమ్మా! మీకు ఇవన్నీ ఎలా తెలుసు?”

 మా మనవరాలు ఆశ్చర్యపడుతూ అడిగింది!

” అత్తమ్మా! మీరు ఇంత ధారాళంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు?”

 మా కోడలు పిల్ల అబ్బుర పడుతూ అడిగింది !

“అమ్మా! మీకు ఇవన్నీ ఎలా యాది ఉంటాయి ?”

పేపర్ బాయ్ సందేహంగా అడిగాడు !

“మేడం ! మీరు ఇంత కొత్తగా ఎలా ఆలోచించగలుగుతున్నారు?”

అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రశంసా పూర్వకంగా అడిగింది !

అమ్మా! నువ్వు గుర్తు వచ్చావు…

ఇవన్నీ ఒకప్పుడు నేను నిన్ను అడిగే దాన్ని కదా…..!

అయినంపూడి శ్రీలక్ష్మి 9989928562

Related posts

(2022) > Diet Pills For Menopause Weight Loss Best Weight Loss Supplement For Women

Bhavani

రేపు శ్రీకాకుళం ఆరంగి వీధిలో సీతారాముల కల్యాణోత్సవం

Satyam NEWS

మేడి పట్టిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

Satyam NEWS

Leave a Comment