36.2 C
Hyderabad
April 25, 2024 19: 37 PM
కవి ప్రపంచం

అవని..అమ్మ!

#Sujata P V L

శరీర కుహరంలో అంకుర భావానికి సిగ్గుల మొగ్గై ముడుచుకుపోతుంది..

తనదైన జీవితానికి స్వస్తి పలికి

గర్భస్థ శిశువు చుట్టూ మధురోహలు అల్లుకుంటుంది..

తనను గది గోడల్ని కాళ్ళతో తన్నుతూంటే..

ఆ కదలికలకు తన్మయురాలవుతుంది..

నెలలు నిండుతూ ఆపసోపాలకు గురవుతున్నా..

కష్టాలకోర్చుకుని..

రక్తం పంచుకుని..పేగులు తెంచుకుని మాతృగండ కారకుడని తెలిసినా

పసివాడి జననం ఫలవంత మవ్వాలనుకుంటుంది..

నవజాత శిశువు పూర్ణాయుష్షు కోసం

ముక్కోటి దేవతలకు ముడుపులు చెల్లించుకుంటుంది..

బిడ్డ ఎదపై తన్నినా..

ఎదుగుదలనే కోరుకుంటుంది..

ప్రపంచానికొచ్చిన తన జీవ భాగాన్ని చూసి మురిసిపోతూ అక్కున చేర్చుకుంటుంది..

బాధల కన్నీళ్ళను ఆనంద భాష్పాలుగా మార్చుకుంటుంది..

బిడ్డ నుదిటిపై దిష్టి చుక్కై..

మెళ్ళో నల్ల తాడై..

దుష్ట చూపులు సోకకుండా

అనుక్షణం పహారా కాస్తుంది..

అమ్మా అంటూ పిలిచినా..

ఆపదల్లో అరచినా..కన్న పేగు కలుక్కుమని.

తినే ముద్దను, చేసే పనికి కూడా వదలి పరుగులెడుతుంది..

బిడ్డలు ఆకాశమెత్తు ఎదిగినా

నేలలో వేరు మూలంగా నిలిచి

పునాదిగా మారి నీడనిచ్చే అవని..’అమ్మ’

సృష్టిలో ఎంతడి వారైనా తీర్చుకోలేని ఋణం..అమ్మ ఒక్కటే! జగమే మెచ్చిన శాశ్వత సత్యమిదే!!

సుజాత.పి.వి.ఎల్., సైనిక్ పురి, సికిందరాబాద్.

Related posts

మృతవీర సైనికులకు జోహార్లు

Satyam NEWS

రామచంద్రుని రాయబారి

Satyam NEWS

హృదయ రాణి

Satyam NEWS

Leave a Comment